ఈ మద్య టాలీవుడ్ లో వస్తున్న సినిమాలు విభిన్న కథాంశాలతో వస్తున్నాయి.  రొటీన్ కి భిన్నంగా వస్తున్న ఈ మూవీస్ కి మంచి ఆదరణ లభిస్తున్నాయి.  తాజాగా యాక్షన్ హీరో గోపించంద్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ మూవీ రిలీజ్ అయ్యింది. కిస్తాన్ నేపథ్యంలో అండర్ కవర్ ఆపరేషన్ లో పాల్గొనే పవర్ ఫుల్ ఏజెంట్ గా గోపీచంద్ నటించాడు. సాధారణంగా  ఈ తరహా స్పై థ్రిల్లర్ మూవీ క్లిక్ అయితే మంచి విజయం సాధిస్తాయి.

ఆ మద్య అడవి శేషు నటించిన ‘గూఢాచారి’ సూపర్ హిట్ అవ్వడమే కాదు మంచి కలెక్షన్లు రాబట్టింది. చాణక్య చిత్ర ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రదర్శించారు. సినిమాపై సోషల్ మీడియాలో ప్రేక్షకులు మిశ్రమ స్పందన తెలుపుతున్నారు.  యూఎస్ లో చాణక్య చిత్ర ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. సీనియర్ నటుడు నాజర్ లీడ్ చేసే రా (Raw) సంస్థలో గోపీచంద్ అండర్ కవర్ ఆఫీసర్. గోపీచంద్ తన నటనతో మరోసారి యాక్షన్ సీన్స్ లో పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు.

కానీ కొన్ని సన్నివేశాలని దర్శకుడు తిరు రొటీన్ గా చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తుంది. గోపీచంద్, హీరోయిన్ మెహ్రీన్ మధ్య సాగే లవ్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు.  సాంగ్స్ కూడా యావరేజ్ టాక్ వచ్చింది.  క్లైమాక్స్ లో రొటీన్ కమర్షియల్ సినిమా తరహాలోనే చాణక్య చిత్రం ముగుస్తుంది. ఓవరాల్ గా చాణక్య యావరేజ్ చిత్రంగా మిగిలిపోనున్నట్లు యూఎస్ ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.  మరి ఇక్కడ ఈ మూవీ సాయంత్రం వరకు హిట్టా..ఫట్టా అనే టాక్ తెలిసిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: