చాలా రోజులుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినప్పటికీ గోపిచంద్ కు మాత్రం సరైన హిట్టు మాత్రం  రాలేదు. అయితే ఇప్పుడు వరకు విజయం  పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మాస్  హీరో గోపీచంద్. ఈ క్రమంలో నేడు విడుదలైన చాణిక్య మూవీ పైన చాలా హోప్స్ పెట్టుకున్నాడు గోపిచంద్.ఈ  సినిమా ఎలాగైనా హిట్టు  సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. అయితే ఇప్పటికే సైరా సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికే... సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలైన వారంలోపే చాణిక్య సినిమా విడుదల చేయాలనుకోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే . అయితే చిరు సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ చాణిక్య సినిమా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అయితే నేడు విడుదలైన గోపీచంద్ చాణిక్య మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది. 

 

 

 

చాణక్య  సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా గ్రిప్పింగ్ గా ఈ సినిమాని తెరకెక్కించారు అని ప్రశంసిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో  గోపీచంద్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా గోపీచంద్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాలని టాలీవుడ్ ప్రముఖుల అంటున్నారు . సినిమా మొత్తం ఆద్యాంతం  ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని చెబుతున్నారు. అయితే  చాణిక్య సినిమాకు  వస్తున్న టాక్  చూస్తే గోపీచంద్ హిట్ కొట్టినట్టే  అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా మెహ్రిన్  నటించగా...  ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్  నటించారు. కాగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. 

 

 

 

 

 అయితే ఈ సినిమాలో కథ నేపథ్యంతో పాటు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ఒక వెన్నుముక్క  లాంటిదని అందరూ చెబుతున్నారు. స్పై  త్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథలో బ్యాక్ గ్రౌండ్  స్కోర్ అద్భుతంగా అందించారని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన సినిమాకు అందించిన సంగీతం బ్రహ్మాండంగా ఉంది అంటూ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏదేమైనా హిట్ టాక్ తో దూసుకుపోతున్న గోపీచంద్ చాణిక్య మూవీతో గోపీచంద్ కి విజయం వరించినట్టే  అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: