గోపీచంద్ కొద్ది రోజులుగా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. తన మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు హీరో గోపీచంద్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో కనిపించారు. మ‌ధ్య‌లో వ‌రుస‌గా రొటీన్ సినిమాల‌తో విసుగెత్తించిన గోపీ ఆ త‌ర్వాత ట్రాక్ మార్చాడు. కాలం మారుతున్న కొద్దీ గోపీచంద్ కూడా రొటీన్ చిత్రాలకు భిన్నం మంచి సబ్జెక్టులను ఎన్నుకోవడం “సాహసం” సినిమా నుంచి మొదలు పెట్టారు. అప్ప‌టి నుంచి టాలీవుడ్ ప్రేక్ష‌కులు గోపీ సినిమాల‌ను చూసే తీరులో కూడా మార్పు వ‌చ్చింది.


తాజాగా గోపీ న‌టించిన సినిమా చాణ‌క్య‌. స్పై థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా మంచి టాక్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో అర్జున్(గోపిచంద్) భారతదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ ఏజెంట్. అయితే ఒక మిషన్ నిమిత్తం బ్యాంకు ఉద్యోగిగా మారాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన క్రూరమైన టెర్రరిస్ట్ ఖురేషికి సంబంధించిన కొంతమంది స్లీపర్ సెల్స్ ను చంపి అతన్ని టార్గెట్ చేస్తాడు. ఓ సంద‌ర్భంలో పాకిస్తాన్‌కు కూడా వెళ‌తాడు.


గోపీచంద్‌కు పాకిస్తాన్ సెంటిమెంట్ బాగా క‌లిసొస్తుంద‌ని మ‌రోసారి చాణ‌క్య ఫ్రూవ్ చేసింది. గ‌తంలో సాహ‌సం సినిమాలో సైతం చాలా క‌థ పాకిస్తాన్ నేప‌థ్యంలో న‌డుస్తుంది. ఆ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా న‌టించింది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు చాలా రోజుల త‌ర్వాత గోపీకి మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు మ‌రోసారి అదే పాకిస్తాన్ సెంటిమెంట్ రిపీట్ అవ్వ‌డంతో పాటు చాణ‌క్య రూపంలో గోపీకి మ‌ళ్లీ హిట్ ఇచ్చింది. ఇక త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు అదిరిపోయే క‌థ‌, క‌థనాల‌తో సినిమాను ప్ర‌జెంట్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: