యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరో గోపీచంద్ కు, లౌక్యం’తర్వాత సరైన హిట్టు లేవు..గతేడాది చేసిన ఆక్సిజెన్, ఆరడుగుల బులెట్, పంతం లాంటి‘ సినిమాతో కూడా హిట్టు కొట్టలేక పోయాడు.అందుకే ఈ సారి హిట్టు కొట్టాలనే కసితో తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ‘స్పై’ థ్రిల్లర్ సినిమా చేసాడు.ఈ షూటింగ్ మధ్యలో,యాక్సిడెంట్ వలన షూటింగ్ కాస్తంత ఆలస్యం అయింది. ఐతేనేం ఎట్టకేలకు రిలీజ్ అయ్యి పాజిటీవ్ టాక్‌ను స్వంతం చేసుకుంది.



ఇకపోతే ‘పంతం’ సినిమా తర్వాత మరోసారి మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది,వీళ్ల కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగానే వర్కవుట్ అయ్యింది.ఇక ‘చాణక్య’గా గోపిచంద్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఇప్పటి వరకు గోపిచంద్ చేసిన పాత్రల్లో కామెడితో పాటు,యాక్షన్, ఫ్యామిలీ ఎంటరైట్‌మెంట్ మూవీస్ కూడా ఉన్నాయి.తనదైన నాచ్యురల్ నటనతో గోపీచంద్ అంటేనే మాస్ అనే విధంగా ప్రతి సినిమాలో తన మార్క్‌ను కనబరిస్తూ ఇక్కడిదాక వచ్చాడు.ఇక ఈ చాణక్య సినిమా విజయంతో గోపి గాడిలో పడ్డట్టే అనుకుంటున్నాయి సినీవర్గాలు.



ఇక మాచో స్టార్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ ఫిర్జా నటించిన ఈ చితాన్ని,ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.ఇక వరుస పరాజయాలతో ఢీలా పడ్డ ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరో గోపీచంద్ ప్రస్తుతం ప్రసాద్ గారి సినిమా చేస్తుండగా.ఇది పూర్తి కాగానే సంపత్ నందితో ఎస్‌.ఎస్‌. స్క్రీన్స్‌ పతాకంపై నిర్మాత చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న.చిత్రంలో నటించడానికి రెడి అయ్యారు.



ఇక తాజాగా ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన తమన్నాను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదిక గా అభిమానులతో పంచుకున్నారు దర్శక, నిర్మాతలు..ఏది ఏమైనా ఇప్పుడు గోపిచంద్ ఈ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది.ఇక వరుసగా తన సినిమాలతో అభిమానుల్ని ఎంతమేరకు అలరిస్తాడో చూడాలని అంటున్నారు నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్.ఒకరకంగా ఈ ‘చాణక్య’సినిమా గోపిచంద్‌కు ఆక్సిజన్ లాంటిదని చెప్పవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: