గోపీచంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'చాణక్య'. తమిళ్ దర్శకుడు తీరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజంగానే ఈ సినిమా దసరా కనుక అని అంటున్నారు సినిమా చుసిన ప్రేక్షకులు. 


స్పై ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉంది, స్పై థ్రిల్లర్‌లో ఒక వైవిధ్య కోణాన్ని ఎంపిక చేసుకుని అద్భుతంగా చూపించారని,  గోపీచంద్ లుక్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా సూపర్ గా ఉందని ఈ సినిమా సూపర్ హిట్ అంటూ ప్రేక్షకులు చెప్తున్నారు. అయితే మరి కొందరు ప్రేక్షకులు మాట్లాడుతూ.. ఈ సినిమా సూపర్ హిట్ చూస్తుంటే మీకేం అర్ధమవుతుంది ? అని ప్రశ్నించి.. 


ఈ మధ్యకాలంలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమాలే. ఆ సినిమాలే సాహూ, సైరా నరసింహారెడ్డి. రెండు సినిమాలు పెట్టినంత బడ్జెట్ ని కూడా తీసుకురాలేకపోయాయి. కానీ ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న సినిమాలు చాణక్య, గ్యాంగ్ లీడర్, వాల్మీకి ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి. 


సినిమా నుంచి బయటకు వచ్చి వారం అయినా ఆ సినిమా ఫీల్ పోకుండా చేస్తున్నాయి. అంత అద్భుతంగా సినిమాలను తీస్తున్నారు అని అంటున్నారు ప్రేక్షకులు. కాగా చాణక్య, గ్యాంగ్ లీడర్, వాల్మీకి వీటి ముందీ వందల కోట్ల సినిమాలేం లెక్క అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా. కథ, కథనం, స్క్రీన్ ప్లే అన్ని కరెక్ట్ గా ఉంటె కోట్లు లేకపోయినా సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి ఈ మూడు సినిమాలే నిదర్శనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: