గోపీచంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్గా నటించిన సినిమా 'చాణక్య'. తమిళ్ దర్శకుడు తీరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా
దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా చుసిన ప్రేక్షకులు అంత ఒకే మాట అంటున్నారు.
స్పై ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ
చాణక్య సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, స్పై థ్రిల్లర్‌లో ఒక వైవిధ్య కోణాన్ని ఎంపిక చేసుకుని అద్భుతంగా చూపించారని, అయితే ఈ సినిమాలో
గోపీచంద్ బదులు ప్రభాస్ నటించింటే ఇంకా అద్భుతంగా ఉండేదని ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో చెప్తున్నారు. ఈ సినిమాలో
గోపీచంద్ అద్భుతంగా నటించాడని అయితే
ప్రభాస్ ఉంటె ఇంకా అద్భుతం అని అంటున్నారు.
అయితే ఈ సినిమా మొత్తం సూటిగా, సుత్తి లేకుండా సినిమాను ఎడిట్ చేశారు అని సినిమా చుసిన ప్రేక్షకులు చెప్తున్నారు. కాగా మరికొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుతూ .. ప్రభాస్ ఇలాంటి చిన్న సినిమాలు తియ్యడు పెద్ద పెద్ద సాహూ లాంటి చిత్రాలు తీస్తాడు అంటూ కామెంట్లు చేశారు. ఏది ఏమైనా ఈ సినిమాలో
గోపీచంద్ కాకుండా
ప్రభాస్ ఉంటె అద్భుతంగా ఉండేదని అంటున్నారు.
ఏ హీరో అయితే ఎం.. సినిమా అద్భుతంగా తీశారు. కథ, కథనంతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ప్రేక్షకుల టాక్ బట్టి చూస్తే ఈ సినిమాతో
గోపీచంద్ మళ్ళి ఫార్మ్ లోకి వచ్చాడు అని చెప్పచ్చు.