అదిరిపోయే ప్లానింగ్ ఉంటే సాదాసీదా క‌థ‌ల‌తో కూడా సూప‌ర్ హిట్లు... హిట్లు తీయ‌వ‌చ్చ‌న్న విష‌యం టాలీవుడ్‌లో గ‌తంలో చాలాసార్లు ఫ్రూవ్ అయ్యింది. ఓ సినిమా హిట్ అయ్యేందుకు కోట్లకు కోట్లు పెడితే ప‌న‌వ్వ‌ద‌న్న విష‌యం టాలీవుడ్లో ఇటీవ‌లే వ‌చ్చిన భారీ సినిమాలు ఫ్రూవ్ చేశాయి. కోట్ల‌కు కోట్లు కుమ్మ‌రిస్తే ఏం జ‌రిగిందో మ‌నం చూశాం. 


ఇక ఇప్పుడు గ్యాంగ్‌లీడ‌ర్‌, చాణ‌క్య‌, వాల్మీకి సినిమాలు త‌క్కువ బ‌డ్జెట్‌తో మంచి క‌థ‌ల‌తో వ‌చ్చి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా సైరా లాంటి పెద్ద సినిమా పోటీలో ఉన్నా కూడా చాణ‌క్య ధైర్యంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఇక తెలిసిన క‌థ‌ను చాలా చ‌క్క‌గా తిరు ప్ర‌జెంట్ చేశాడు. ఒక అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించిన గోపీచంద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు. గోపీచంద్ పెర్ఫామెన్స్ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ మాత్రం గోపీచంద్ సినిమాల నుంచి ఏం కోరుకుంటారో వారికి సంతృప్తి కలిగించదు.


అయితే సెకండాఫ్‌లో మాత్రం అటు ద‌ర్శ‌కుడు తిరు.. ఇటు గోపీ ఇద్ద‌రు చిత‌క్కొట్టేశారు. సెకండాఫ్‌లో కథానుసారం వచ్చే ట్విస్టులు కథనం ఆసక్తికరంగా మారడం వంటివి ప్లస్సవుతాయి. అలాగే గోపీచంద్ మరియు మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. చాణ‌క్య‌లో మరో ముఖ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ చేసిన ఐటెం సాంగ్ సహా సహాయక పాత్రలో మంచి నటన కనబరిచింది.


ఇక ద‌ర్శ‌కుడు తిరుకు తెలుగులో ఇదే తొలి సినిమా. కథను రాసుకున్న తిరు తాను సెకండాఫ్ తెరకెక్కించినట్టుగా ఫస్ట్ హాఫ్ ను కూడా మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే ఈ సినిమా రేంజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్నట్టుగా ఉండేది. అయినా ఓవ‌రాల్‌గా మాత్రం మెప్పించాడు. గోపీకి మ‌రో హిట్ ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: