గోపీచంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'చాణక్య'. తమిళ్ దర్శకుడు తీరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడి నోటి నుండి ఒకే మాట వినపడుతుంది.    


స్పై ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చాణక్య సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, స్పై థ్రిల్లర్‌లో ఒక వైవిధ్య కోణాన్ని ఎంపిక చేసుకుని అద్భుతంగా చూపించారని వారు వ్యాక్యనిస్తున్నారు. కాగా ఇప్పటికే యాక్షన్ ఇమేజ్ ని సంపాదించుకున్న గోపీచంద్ ఈ సినిమాలో ఇంకా అద్భుతంగా నటించాడని వారు అంటున్నారు. కాగా ఈ సినిమా దసరా పండుగా సంధర్బంగా విడుదలైనా సంగతి తెలిసిందే.     


అయితే ఈ సినిమాలో గోపి చాంద్ భారత దేశం కోసం సీక్రెట్ ఏజంట్ గా రా పని చేస్తుంటాడు. పైకి మాత్రం బ్యాంకు ఉద్యోగిగా అమాయకుడిలా నటించి అందరిని ఆకట్టుకుంటాడు. అయితే సినిమా సంబంధించిన కథ ఎంతో అద్భుతంగా ఉంది. తన దేశాన్ని కాపాడటానికి చాణుక్యుడిలా అలోచించి తీవ్రవాదుల నుంచి దేశాన్ని, తన స్నేహితులను కాపాడుకుంటాడు. దీంతో ఈ సినిమా నిజంగా చెడు పై మంచి విజయం, అసలైన దసరా సినిమా అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ కి మరో హిట్ దక్కింది.         


ఏ హీరో అయితే ఎం.. సినిమా అద్భుతంగా తీశారు. కథ, కథనంతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ప్రేక్షకుల టాక్ బట్టి చూస్తే ఈ సినిమాతో గోపీచంద్ మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు అని చెప్పచ్చు.         


మరింత సమాచారం తెలుసుకోండి: