గోపీచంద్ - త‌మిళ్ డైరెక్ట‌ర్ తిరు కాంబినేష‌న్లో వ‌చ్చిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చాణ‌క్య ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. గోపీచంద్ మొదటిసారి రా ఏజెంట్ గా నటించినా ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. యాక్షన్ హీరోగా మంచి పేరున్న గోపీచంద్ డిఫరెంట్ లుక్ లో సాలిడ్ బాడీతో ఆకట్టుకున్నారు. ఇక గోపిచంద్‌తో రెండోసారి జోడీ క‌ట్టిన మెహ్రీన్ ఫిర్జాదా త‌న గ్లామ‌ర్‌తో పాటు క్యూట్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నారు.


ఆమె కుక్క సీన్ల‌లో గోపీ కుక్క కోసం ప‌డే పాట్లు బాగున్నాయి. మెహ్రీన్ అందాలు సినిమాకే హైలెట్ అయ్య‌యి. సినిమాలో మెహ్రీన్‌తో పాటు హిందీ అమ్మాయి జ‌రీన్ ఖాన్ ఇద్ద‌రు గ్లామ‌ర్ ర‌సం బాగా వ‌ల‌క‌పోశారు. మెహ్రీన్ విష‌యానికి వ‌స్తే ఇటు గోపీతో ల‌వ్ సీన్ల‌లో కెమిస్ట్రీ పండిచ‌డంతో పాటు  అలీ, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలలో ఆమె కొంచెం హాస్యం కూడా పండించింది.


ఇక సెకండాఫ్‌లో మెహ్రీన్‌కు స్క్రీన్ ప్రెజెన్సీ త‌క్కువ ఉంద‌నుకుంటున్న టైంలో ఎంట్రీ ఇచ్చిన జ‌రీన్‌ఖాన్ చ‌క్క‌గా ఆక‌ట్టుకుంది. పాకిస్తాన్ లో ఉంటూ రా కోసం పనిచేసే పాత్రలో లేడీ ఏజెంట్ పాత్రలో జరీన్ ఖాన్ చక్కగా సరిపోయింది. వాస్తవంగా ముస్లిం అయిన జరీన్ పాకిస్తాన్ కి చెందిన ఆమ్మాయిపాత్రలో చక్కగా ఒదిగిపోయింది. సెకండ్ హాఫ్ లో మెహ్రిన్ కనిపించకపోవడం వలన మిస్ అయినా గ్లామర్ లోటు ఆమె తీర్చారు.


ఇక సెకండాఫ్‌లో వ‌చ్చిన జ‌రీన్‌ఖాన్ ఐటెం సాంగ్ సైతం అదిరిపోయింది. ఈ ఐటెం సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంతో పాటు విజిల్స్ ప‌డ్డాయి. ఏదేమైనా సినిమా మొత్తం మీద అటు మెహ్రీన్‌, ఇటు జ‌రీన్‌ఖాన్ ఇద్ద‌రు గ్లామ‌రసం బాగా వ‌ల‌క‌బోయ‌డంతో పాటు ఆ ర‌సాన్ని ఆస్వాదించే ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: