మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. ఈ బుధ‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కి ఏకంగా ఐదు భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం భాష‌ల్లో రిలీజ్ అయ్యింది.


క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా చిరు న‌టించాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ సైరా గురువు గోసాయి వెంక‌న్న‌గా న‌టిస్తే... న‌య‌న‌తార సైరా భార్య సిద్ధ‌మ్మ పాత్ర‌లోనూ.. త‌మ‌న్నా సైరా ప్రియురాలు వెంక‌ట‌ల‌క్ష్మిగాను న‌టించారు. ఇక సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా లాంటి కీల‌క తారాగ‌ణం న‌టించిన ఈ సినిమాను రు.280 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో చిరు త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మించారు.


బుధ‌వారం తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు.38 కోట్ల షేర్ రాబ‌ట్టింది. రెండో రోజు రు.10 కోట్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా మూడు రోజుల‌కు మొత్తం రు. 54.50 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే రెండో రోజే క‌లెక్ష‌న్ల‌లో 30 శాతం డ్రాప్ వ‌చ్చింది. మూడో రోజు ఓవ‌రాల్‌గా రు.6 కోట్లు కొల్ల‌గొట్టింది. అయితే తాజాగా ఇవాళ గోపీచంద్ నటించిన ‘చాణక్య’ సినిమా కూడా విడుదల కావడంతో ‘సైరా’ కి కొన్ని థియేటర్లు తగ్గాయి.


తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్లు ఓ మోస్తరుగా ఉన్నా ఇత‌ర లాంగ్వేజెస్‌లో మాత్రం సైరాకు న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇక తెలుగులో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రు.54 కోట్లు రాబ‌ట్టిన సైరా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మ‌రో రు.56 కోట్లు కొల్ల‌గొట్టాలి. అంటే యావ‌రేజ్‌న రోజుకు రు. 5 కోట్లు లెక్క‌న ఏ మాత్రం త‌గ్గ‌కుండా మ‌రో 10 రోజుల వ‌ర‌కు ఇవే వ‌సూళ్లు రావాలి. లేక‌పోతే రామ్‌చ‌ర‌ణ్ నిండా మునిగిపోతాడు. మ‌రి చిరు చెర్రీని ఏం చేస్తాడో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: