టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సైరా నరసంహారెడ్డి. మెగాస్టార్ కలల చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుండి టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దాదాపుగా రూ.250 కోట్లకు పైగా ఖర్చుతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా, స్వాతంత్రోద్యమ కథాంశంతో రూపొందింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పలు భాషలకు చెందిన అగ్ర నటులు నటించడం జరిగింది. ఇక పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేసారు. 

ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య మొన్న గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా మిక్స్డ్ టాక్ ని సంపాదించింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో బాగానే కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమాకు మరికొన్ని ప్రాంతాల్లో అయితే అస్సలు ఊహించని విధంగా చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల వరకు కలెక్షన్ వచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ దానిపై ఇప్పటికీ కూడా సరైన అధికారిక ప్రకటన లేదు. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో కొంత సెటైరికల్ గా మాట్లాడడం నేడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్, 

మెగాస్టార్ రేంజ్ గొప్ప ఇమేజ్ ఉన్న చిరంజీవి గారు చేయదగినది కాదని తమ్మారెడ్డి అప్పట్లో ఆ పాటపై కొంత పరోక్ష వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపోతే నేడు సైరా కలెక్షన్స్ విషయమై ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ, అవును సైరాకు రూ.200, రూ.300, రూ. 500 కోట్ల కలెక్షన్ వస్తోంది, రాబోయే రోజుల్లో రూ.1000, రూ.2000కోట్లు కూడా వసూలు చేస్తుంది అంటూ కొంత సెటైర్లు వేస్తూ జవాబివ్వడం జరిగింది. అయితే నిజానికి ప్రస్తుతం సైరా కలెక్షన్స్ అంత ఆశాజనకంగా లేవని కొందరు సినీ విశ్లేషకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: