కన్నడ సినీ నటుడు, నిర్మాత హుచ్చ వెంకట్ పై రాజానుకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మద్య కొడగు జిల్లాలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు నటుడు వచ్చాడంటూ ఎగబడి చూశారు. ఇది నచ్చని వెంకట్‌ హోటల్‌ నుంచి రోడ్డుపైకి వచ్చి అక్కడున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కారు డోర్‌నూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే వెంకట్ వింత ప్రవర్తన చూసి జనాలు షాక్ తిన్నారు..ఆ తర్వాత తేరుకొని ఆయనను చితకబాదారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. 

గత కొంత కాలంగా నటుడు వెంకట్ ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని అతని సన్నిహితులు తెలుపుతున్నారు. తాజాగా హిందూపురం-యలహంక మార్గంలోని మారసంద్ర టోల్ గేట్ వద్ద ఆయన మరోసారి రచ్చ రచ్చ చేశారు. టోల్ వద్ద బస్ కోసం వేచి చూస్తున్న ఓ కాలేజ్ అమ్మాయి వద్దకు వెళ్లి... తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించాడు.

తాను మంచి నటుడిని..తనను పెళ్లి చేసుకుంటే లైఫ బాగుంటుందని ఆమెను పదే పదే అడిగి వేధించాడట. నటుడు వెంకట్ పిచ్చి ప్రవర్తనతో ఆ అమ్మాయి భయబ్రాంతులకు గురై వెంటనే అక్కడ నుంచి పరుగు పెట్టిందట.    నేపథ్యంలో, తన కారు అద్దాలను తానే హుచ్చ వెంకట్ పగలగొట్టుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనను స్టేషన్ కు తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: