మళయాళ పరిశ్రమలో స్టార్ డైరక్టర్ అయిన ప్రియదర్శన్ తన కూతురు కళ్యాణిని హీరోయిన్ గా పరిచయం చేశారు. స్టార్ డైరక్టర్ గా ప్రియదర్శన్ ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. హీరోయిన్ గా కళ్యాణి కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో కూడా ఆమెకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. అఖిల్ హలో సినిమాలో నటించిన కళ్యాణి సాయి ధరం తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగం సినిమాల్లో నటించింది. 


హీరోయిన్ గా ఇంకా స్టార్ క్రేజ్ దక్కించుకోని ఈ అమ్మడు అప్పుడే పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ తో కళ్యాణి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. మోహన్ లాల్, ప్రియదర్శన్ ఇద్దరు మంచి స్నేహితులు వారిద్దరిలానే కళ్యాణి, ప్రణవ్ లు మంచి స్నేహితులుగా ఉన్నారు.


అయితే వారి స్నేహం కాస్త ప్రేమగా మారిందట. వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దవాళ్లకు తెలియగా వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. క్యూట్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అప్పుడే ఈ భామ పెళ్లికి రెడీ అవడంపై ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.


ఒకవేళ పెళ్లైనా సరే సమంతలా సినిమాలు చేసేందుకు ఆమె సై అన్నట్టు తెలుస్తుంది. స్టార్ డైరక్టర్ తనయుడిగా ప్రణవ్ కూడా మళయాళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మళయాళంలోనే సినిమాలు చేస్తున్న ప్రణవ్ సౌత్ లో మిగతా భాషల్లో కూడా సినిమా చేయాలని చూస్తున్నాడు. మోహన్ లాల్ తనయుడిగా అతనికి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడటం ఖాయం. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్న ఈ ఇద్దరు సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారు. పరిశ్రమ మొత్తం అటేండ్ అయ్యేలా గ్రాండ్ గా ప్రణవ్, కళ్యాణిల పెళ్లి జరుగబోతుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: