డ్రగ్స్ మరియు రియల్ ఎస్టేట్ విషయంలో మాఫియా చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన వార్తలు ఇప్పటివరకు అనేకసార్లు బయటపడ్డాయి. అయితే ఇప్పడు ‘సైరా’ మూవీని కూడ మాఫియా  వెంటాడటం అంత్యంత ఆశ్చర్యంగా మారింది. 

కెనడా దేశంలో ఒంటారియో ప్రావిన్స్ లో 'సైరా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లలో ఒక ఆగంతకుడు సినిమా ధియేటర్ లోకి వచ్చి కత్తితో ఆ ధియేటర్ స్క్రీన్ ను చింపడమే కాకుండా ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే చల్లడం అత్యంత సంచలనంగా మారింది. దీనితో ఎలర్ట్ అయిన కెనడాలోని ఆ ధియేటర్ల యాజమాన్యాలు ‘సైరా’ సినిమా ప్రదర్శనలు రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

షాక్ ఇచ్చే ఈ న్యూస్ వివరాలలోకి వెళితే దీని వెనుక ఒక పెద్ద కథ ఉందని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కెనడాలో సినిమాల డిస్ట్రిబ్యూషన్ కొందరి గుప్పిట్లో ఉందని వారిలో ముఖ్యంగా కొందరు తెలుగు తమిళ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని సమాచారం.  అయితే ఈ డిస్ట్రిబ్యూటర్లది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఇంతకాలం సాగుతూ వచ్చిందట.  

కలెక్షన్స్ ట్యాక్స్ ల లెక్కలు కూడా వారు ఎంత చెప్తే అంతేనట. హైదరాబాద్ లో ఉన్న నిర్మాతలకు వారు సినిమాలకు సంబంధించి సరైన లెక్కలు చెప్పారని అంటారు. దీనితో ఈ సమస్యల నుండి తప్పించుకుందామని రామ్ చరణ్ ‘సైరా’ ను కెనడాలోని లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు రైట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా కెనడాలోని మల్టిప్లెక్స్ చెయిన్ కు పంపిణీ హక్కులు డైరెక్ట్ గా ఇచ్చాడని తెలుస్తోంది. దీనితో అసహనానికి లోనైన కొందరు కెనడా డిస్ట్రిబ్యూటర్స్ వెనక ఉండి ఈ ఆగంతకుడుని ధియేటర్ లోకి పంపించి అలజడి సృష్టించారని వార్తలు వస్తున్నాయి. దీనితో ఓవర్సీస్ మార్కెట్ ను కూడ కొందరు టాలీవుడ్ మార్కెట్ లాగే తమ చేతిలోకి తీసుకుని శాసిస్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: