ఓటమి ఎరుగని దర్శకుడు ధీరుడు  రాజమౌళి సినిమా వస్తుందంటే టాలీవుడ్ లో ఎన్ని అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే మొన్నటి వరకు టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన జక్కన్న క్రేజ్ ... ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సెన్సేషన్ హిట్ తర్వాత జక్కన్న క్రేజ్  ప్రపంచం నలుమూలలకు పాకింది. అయితే ఇప్పుడు జక్కన సినిమా వస్తుందంటే ఒక్క టాలీవుడ్ లోనే కాదు  అన్ని ఇండస్ట్రీ లలో  ఆసక్తిగా ఎదురు  చూస్తూ ఉంటాయి. బాహుబలి ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత రాజమౌళి టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్  కూడా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. స్వతంత్ర సమరయోధులు అయిన అల్లూరి సీతారామరాజు,  కొమరంభీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది  ఈ సినిమా. 

 

 

 

 

 అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కాగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే మామూలుగానే రాజమౌళి సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. బాహుబలి  లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ  నేపథ్యంలో ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది ఒక పెద్ద సెన్సేషన్ గా  మారుతుంది. 

 

 

 

 

 అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ వార్త  బయటకు రావడంతో సినీ  వర్గాల్లో  దీనిపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్ గా ఫిక్స్ చేసిన రాజమౌళి... ఆర్ఆర్ఆర్ టైటిల్ ని కొనసాగిస్తూ "రామ రౌద్ర రుషితం"   అనే టైటిల్ ను చిత్రబంధ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండటంతో ఇంగ్లీష్ లో ఈ సినిమాకి "రైజ్ రివోల్డ్  రివెంజ్"  అనే టైటిల్ ను చిత్ర బృందం  పరిశీలిస్తుందట . కాగా దీనిపై చిత్ర బృందం త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: