దిల్ రాజు..ఒకప్పుడు నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్..ఇప్పుడు నంబర్ వన్ ప్రొడ్యూసర్. ఒకరకంగా చెప్పాలంటే దిల్ రాజు ఆఫీస్ ని పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనొచ్చు. ఎందుకంటే వరుసగా సినిమా తర్వాత సినిమా తన బ్యానర్ నుండి రెడీ అవుతూనే ఉంటుంది. ఎక్కువగా కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ తన సంస్థ నుండి పరిచయం చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అలా దిల్ రాజు ద్వారా దర్శకులైన ఎంతో మంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి..ఇలా చెప్పుకుంటు పోతే లిస్ట్ చాలా పెద్దదే. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలని నిర్మిస్తున్నారు. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్ గాను రాజు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.

టాలీవుడ్ లో నిర్మాత దిల్ రాజు సినిమా ఆఫీసు బాలీవుడ్ లో ఉన్న పెద్ద ఫిల్మ్ ఫ్యాక్టరీలాగే తయారవుతోంది. షూటింగ్స్ లో రెండు సినిమాలు, విడుదలకు సిద్దంగా రెండు సినిమాలు, ప్లానింగ్ లో మరో రెండు సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ లో రెండు సినిమాలు.. ఇలా అన్నీ రకాలుగా వరుస సినిమాలే. సుధీర్ బాబు-నాని-ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా రెడీ అవుతోంది. గతంలో నాని-ఇంద్రగంటి కాంబోలో జెంటిల్ మాన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సమంత-శర్వా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక రాజ్ తరుణ్ హీరోగా నిర్మించిన చిన్న సినిమా నవంబర్ 8న విడుదలకు రెడీ చేసేస్తున్నారు. ఈలోగా ఈనెల 9న వి.వి.వినాయక్ హీరోగా ప్లాన్ చేస్తున్న సినిమాకు శ్రీకారం చుడుతున్నారు దిల్ రాజు. ఈ సినిమాలో వినాయక్ మెకానిక్ గ్యారేజ్ షెడ్ ఓనర్ గా కనిపించబోతున్నారని తాజా సమాచారం. ఇక వినాయక్ ని డైరెక్టర్ గా లాంచ్ చేసింది దిల్ రాజు నే.

రాజ్ తరుణ్ సినిమాను సింపుల్ గా అయిదు కోట్లలో తీసి, నాన్ థియేటర్ హక్కులతో వెనక్కు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఓన్ గా విడుదల చేసేందుకు రాజు రెడీ అయ్యారు. ఈ సినిమా తర్వాత డిసెంబర్ లో శర్వా-సమంత సినిమా విడుదలకు రెడీ అవుతున్నారు. 2020 సంక్రాంతికి నాలుగు సినిమాలు దిల్ రాజు విడుదల చేస్తున్నవే కావడం విశేషం. మహేష్ సరిలేరు, అల్లు అర్జున్ అల, సర్కార్, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా.. ఈ నాలుగు కూడా దిల్ రాజే విడుదల చేస్తున్నారు. మొత్తానికి దిల్ రాజు టాలీవుడ్ లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అని ఇంతకంటే వేరే చెప్పాలా..! 


మరింత సమాచారం తెలుసుకోండి: