ఈ విజయదశమి నాడు జరగబోతున్న బన్నీ మహేష్ ల వార్ అత్యంత ఆశ్చర్యంగా మారింది.. వీరిద్దరూ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీలు సంక్రాంతి రేసుకు రాబోతున్నాయి. అయితే విజయదశమి వదులుకోవడం ఇష్టంలేక వీరిద్దరి సినిమాలకు సంబంధించిన రెండు పోస్టర్లు రేపు విడుదల చేయబోతున్నారు. ‘సాహో’ ‘సైరా’ మూవీలు బయ్యర్లకు చేదు అనుభవం కలగచేయడంతో మహేష్ బన్నీల మూవీలకు దసరా నుండే ప్రమోషన్ మొదలుపెట్టి ఈ మూవీ బయ్యర్లకు ధైర్యం కలిగించే ఆలోచనలు చేస్తున్నారు. 

దీనితో దసరా పండుగ రోజున మహేష్ బన్నీల అభిమానులకు మంచి జోష్ కలగ బోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు తాను కూడ దసరా రేస్ లో ఉన్నాను అంటూ బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ ల మూవీకి సంబంధించిన పోస్టర్ కూడ రేపు విడుదల కాబోతోంది. ఇది చాలదు అన్నట్లుగా వెంకటేష్ నాగచైతన్యలు కలిసి నటించిన ‘వెంకీమామ’ టీజర్ ను కూడ రేపు విడుదల చేయబోతున్నారు. 

దీనితో రేపటి దసరా పండుగ రోజున టాప్ హీరోల హడావిడి చాల ఎక్కువగా కనిపించబోతోంది. ఈ విజయదశమి సెంటిమెంట్ తో సాయి తేజ్ కొత్త సినిమా 'సోలో బతుకే సో బెటర్' మూవీ ప్రారంభోత్సవం కూడ రేపే జరగబోతోంది. వీటికితోడు దసరా సంబరాలలో తాను కూడ ఉన్నాను అంటూ అడవి సాయి కిరణ్ మూవీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ట్రైలర్ కూడ విడుదల చేస్తున్నారు.

వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాల టీజర్స్ ఫస్ట్ లుక్స్ రేపు రాబోతున్నాయి. ఈ దసరాకు ‘సైరా’ ‘చాణక్య’ లతో పాటు మరికొన్ని సినిమాలు విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీసు వద్ద వాటి హడావిడి చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. దీనితో ఈసారి దసరా రేస్ ఊహించిన స్థాయిలో లేదు అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: