ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో అమ్మాయిలు చాలా ఎక్కువగానే ఎదిగిపోతున్నారు. కొత్త కొత్త చట్టాలకు మన సుప్రీంకోర్టు ఆమోదం ప్రకటించినప్పటి నుంచి వారి లోపల ఉన్న కోరికలు అన్నిటిని ఎలాంటి మొహమాటం లేకుండా బయట పెట్టేస్తున్నారు. ఇక కాస్తోకూస్తో పేరుమోసిన సెలబ్రిటీలు అయితే పరిపక్వత అనే పదాన్ని అడ్డుపెట్టుకొని తమకు నచ్చింది బయటికి చెప్పేస్తున్నారు. ఇదే కోవకు చెందుతుంది తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన. 

ఇంతకీ ఆమె చేసిన ప్రకటన ఎందుకంటే తనకు బాలీవుడ్ హీరో మరియు హాన్సమ్ హంక్ అని పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ స్పెర్మ్ కావాలట. 'వార్' సినిమా చూసి హృతిక్ రోషన్ పై తెగ ప్రేమ పెంచేసుకుంది ఈ క్రికెట్ భామ. అందుకే హృతిక్ రోషన్ తో తనకు సంతానం కావాలన్నట్లు ఈ ప్రకటన చేసింది. హృతిక్ రోషన్ వార్ సినిమాలో తనకు విరీతంగా నచ్చేసాడని అందుకే ఏకంగా హీరో స్పెర్మ్ కావాలని ఓపెన్ గా ప్రకటన చేసింది. ఇప్పుడు ఈమె చేసిన ఈ ప్రకటన ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

తను వార్ సినిమా చూస్తున్నంత సేపు కేవలం హృతిక్ రోషన్ ను మాత్రమే చూస్తూ ఉండిపోయినట్లుగా చెప్పుకొచ్చింది భావన. తనకు అంత నచ్చేసిన ఈ బాలీవుడ్ హీరో పైన తనకు ఉన్న ప్రేమను మామూలు రీతిలో వ్యక్తపరిస్తే గుర్తింపు రాదని అనుకుందో ఏమో కానీ ఏకంగా అతని స్పెర్మ్ ను అడిగేసింది. ఆమెకు కూడా హృతిక్ రోషన్ లక్షణాలు మరియు దేహ దారుడ్యం ఉన్న పిల్లలు పుడతారని ఆశ కావచ్చు. ఈమె పాటికి ఈమె ప్రకటన అయితే చేసుకుంది కానీ హృతిక్ రోషన్ మాత్రం వీరికి అలాంటి ఛాన్స్ ఇవ్వరు ఏమోకంటే ఆయనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: