దసరా అంటే విజయదశమి.. పేరులోనే విజయం ఉంది. దుర్గాదేవి కరుణ కటాక్షం కలగడం వల్ల ఎవరైనా సుఖ సంతోషాలతో నెలకొంటారని అంటున్నారు. అందరు దేవి నవరాత్రులను జరుపుకుంటారు. తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో అవతారంలో నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 


ఈ పండుగ అంటే తెలుగు జనాలకి చాలా ఇష్టమా.. అమ్మాయిలు అందరు అమ్మవారిలా తయారయ్యి దుర్గమ్మను పూజిస్తారు. ఇకపోతే ఈ విజయ దశమి సినీ జనాలకు కూడా చాలా మంచి రోజని అందరు నమ్ముతారు. ఈరోజు సినిమా గురించి కాస్త పబ్లిసిటీ పెంచితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని వారి నమ్మకం. 



దసరాకు పబ్లిసిటీ జోరు పెంచిన సినిమాల విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా ,సరిలేరు నీకెవ్వరూ', ఈ సినిమా షూటింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇకపోతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్నా సినిమా అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బరిలోకి దిగబోతున్నాయి. రేపు ఈ సినిమాల నుండి మరొక పోస్టర్ రిలీజ్ కాబోతుంది. 



బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్ రూలర్ అని రేపు చిత్ర యూనిట్ వెల్లడించనుంది. వెంకీ మామ సినిమా నుండి మరో టీజర్ రిలీజ్ కాబోతుంది. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ కు రేపు మూహూర్తం ఖరారు చేశారు. అడవి శేష్ నటిస్తున్న ఆపరేషన్ గోల్డెన్ ఫిష్ సినిమా నుండి ట్రైలర్ విడుదల కాబోతుంది.. ఈ సినిమాలన్నిటికీ అనుకున్న పలితాలు వస్తాయోలేదో రిలీజ్ అయితే కానీ తెలియదు. ఏది ఏమైనా కూడా సినిమాలు విజదశమికి అన్ని సినిమాలు వెలుగులోకి రానున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: