అనుష్క  చాల తర్వాత నిశ్శబ్దం అని ఒక కొత్త సినిమా చేస్తుంది.ఈ సినిమాలో మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ కూడా ఇందులో ఒక పాత్ర పోషిస్తున్నారు. చాల సంవత్సరాల తర్వాత  హేమంత్ మధుకర్ ఈ సినిమాకు  డైరెక్ట్ చేస్తున్నాడు. ఔట్ డేట్ అయిపోయిన రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకు రచనా సహకారం అందిస్తూ నిర్మాతగా వహిస్తున్నారు.ఇంకా ఈ సినిమా మొదలు కావడానికి ముందు నుంచి కోన అండ్ టీం వాళ్ళు మామూలుగా హడావుడి చేయడం లేదు.


 ముందే అనుష్క లీన్ లుక్ ఒకటి రిలీజ్ చేయడం.. మాధవన్తో పాటు మాడిసన్ ఈ సినిమాలో భాగం కావడం గురించి ఒక  పెద్ద రేంజ్ లో  ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ లుక్ ఒకటి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్  చేశారు. సోషల్ మీడియాలో వీటి గురించి చిత్ర బృందం మామూలుగా డబ్బా కొట్టు కోవడం లేదు.
ఇప్పుడు మాధవన్ ఫస్ట్ లుక్ గురించి హడావుడి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

ఇందులో అతను మ్యుజీషియన్ పాత్ర పోషిస్తున్నారు. అనుష్క ఇందులో మాట్లాడలేని వినబడని ఒక మ్యూట్ ఆర్టిస్టు పాత్ర చేస్తుంది. ఈ పాత్రల వ్యవహారం చూస్తే మన జనాలకు ఇదే ఏ మాత్రం అనిపిస్తోంది చూడాలి మరి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని మొదటి నుంచి చాల పెద్ద హడావిడి కానీ.. ఇప్పటిదాకా మన ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి తెయ్వడంలో విజయవంతం మాత్రం కాలేేదు చిత్ర బృందం.

అనుష్క మాధవన్ జోడీ కడితేనేమి.. హాలీవుడ్ నటుడు చేస్తేనేమి.. ముందు ఈ సినిమా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉంటుందా లేదా అన్నది గమనార్హం. ఇప్పటికైతే సినిమాకు మన దగ్గర బజ్ క్రియేట్ కాలేదు. ఇక సినిమా టీజర్ రిలీజ్ తర్వాత ఏమైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: