ప్రతి ఏటా వచ్చే పండుగల్లో అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే అతి పెద్ద పండుగ మకర సంక్రాంతి. వాస్తవానికి ఆ సమయంలో రైతులకు పంట చేతికి రావడం, వాటిని అమ్ముకుని ఇంటిల్లి పాది అందరూ కొత్త బట్టలు, ఎన్నో రకాల పిండి వంటలతో బంధుమిత్రుల కలయికతో ఎంతో ఆనందంగా గడిపే ఈ పండుగ సమయంలో సినిమాల రిలీజ్ లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక సంక్రాంతి బరిలో సినిమాలు నిలుస్తున్నాయి అంటే ప్రేక్షకుల్లో వాటిపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ఇప్పటివరకు నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడానికి రెడీ అయ్యాయి. వాటిలో ముందుగా రజినికాంత్ మరియు మురుగదాస్ ల కలయికలో రెడీ అవుతున్న దర్బార్ సినిమా ఒకటి. 

రజినీకాంత్ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు మురుగదాస్ మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక వీటితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుండి రిలీజ్ అయిన ఒక సాంగ్, అద్భుతంగా శ్రోతలను అలరిస్తూ సినిమాపై అమాంతం క్రేజ్ ని పెంచేసింది. మంచి కమర్షియల్ హంగులతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇకపోతే ఈ మూడు భారీ సినిమాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ కానుంది. మంచి ఆకట్టుకునే కథాంశంతో ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి బెర్తులను కన్ఫర్మ్ చేసుకోగా, బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ ల సినిమా కూడా ఇదే పొంగల్ బరిలో నిలిచే అవకాశం కనపడుతోంది. దీనిని బట్టి ఏకంగా ఈ ఐదు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కన్నుల విందు అందించనున్నాయి. మరి వీటిలో ఏవేవి ఎంతమేర విజయాన్ని అందుకుంటాయో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: