తెలుగులో ప్రపంచ స్థాయిని సొంతం చేసుకున్న సినిమా అంటే వినిపించే పేరు బాహుబలి.. ఆ రేంజుకు ఏ సినిమా రాలేదు.. అది దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో ఉన్న మహాహత్యం అలాంటిది.. అయన చేసిన మగధీర, విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాలలో బ్లాక్ బాస్టర్ కాగా, ఈగ వంటి చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 


ఇకపోతే తెలుగులో జక్కన్న చేసిన రేంజులో చేయాలని చాలా మంది ప్రయతించారు వారి ప్రయత్నం ఫలితం అధిక ఖర్చు, వృధా ప్రయాస, మీ సినిమా రా బాబు తలా నొప్పి అనే మాటలను మూట కట్టుకొని కొన్ని రోజులకే మూటా ముల్లె సర్దుకున్నాయి. దానికి ఉదాహరణగా సాహో, సైరా సినిమాలు.  పెద్దగా చూపించిన పైన పటారం లోన లొటారంలా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. 


భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలు కలెక్షన్స్ విషయానికొస్తే ఫుల్ గా రాబట్టాయి కానీ, మిశ్రమ టాక్ తో అటకకెక్కాయి. ఇకపోతే ఆ సినిమాల తర్వాత వచ్చిన చిన్న సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. మొన్న వచ్చిన గ్యాంగ్ లీడర్, వాల్మీకి, చాణక్య  సినిమాలు ఆ వరుసలో ఉన్నాయి. 


తాజాగా ఈరోజు విజయ దశమి కానుకగా రిలీజ్ అయిన దిల్ రాజ్ నిర్మించిన సినిమా ఎవరికీ చెప్పొద్దూ.. రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు బసవ ఆశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పైఈ సినిమా తెరకెక్కుతుంది. ఇకపోతే రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ 'ఎవ్వరికీ చెప్పొద్దు'. శ్రీ వెంకటేశ్వరా పతాకంపై నిర్మించారు.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బాగుందని టాక్ వినపడుతుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: