ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతిని పోగొట్టిన హీరోయిన పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో తన నటనతో పాటు అందంతో అందరినీ పిచ్చెక్కించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటిస్తున్న మరో చిత్రం ఆర్ డి ఎక్స్ లవ్. మొన్న రిలీజైన టీజర్ కి విశేష స్పందన లభించింది. అయితే ఈ టీజర్ లో ఎక్కువ భాగం పాయల్ అందాల మీదే దృష్టి కేంద్రీకరించారని అర్థం అవుతుంది.


తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా భాను శంకర్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు భాను శంకర్ మాట్లాడుతూ,పాయల్‌ రాజ్‌పుత్‌ మంచి నటి అని, ఈ సినిమాలో ఆమెది చాలా బలమైన పాత్ర అని చెప్పారు ఇంకా, బోల్డ్ కంటెంట్ మాత్రమే తీసుకుని బోల్డ్ గా చెప్పాలని అనుకోవడం ఒక పద్దతి అని, కానీ సినిమా బోల్డ్ కంటెంట్ తో సామాజిక కోణం స్పృసిస్తూ చెప్పిన కథ ఇది అని దర్శకులు చెప్పారు.


కావాలని బోల్డ్ కంటెంట్ తో సినిమా తీయలేదని యూత్ ని టార్గెట్ చేయాలని కథలో బోల్డ్ కంటెంట్ పెట్టలేదని సినిమాకి అవసరం ఉండడంతో బోల్డ్ కంటెంట్ పెట్టినట్లు చెప్పారు. కథలోనే యూత్ టార్గెట్ అంశాలు చాలా ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చాలా బాగా నటించిందని, ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని తప్ప వేరే వాళ్లని ఊహించుకోలేకపోతున్నామని అన్నారు.


పాయల్ సౌందర్య, అనుష్క రేంజ్ లోకి వెళ్తుందని, అందంతో పాటు చక్కని అభినయం ఆమె సొంతం. అందువల్ల ఆమె రేంజ్ వేరేలా ఉంటుందని దర్శకులు చెప్పారు. టీజర్ చూస్తే బోల్డ్ గా కనిపించిన ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: