జేజమ్మ,భాగమతి,అరుంధతి,రుద్రమదేవిఇలా పాత్ర ఏదైనా తన స్టైల్ లో మెప్పిస్తూ తెలుగు ప్రజలందరి హృదయాల్లో  పదిలంగా గుర్తుండి పోయిన అనుష్క ఇప్పుడు నిశ్శబ్దం అనే ప్రయోగాత్మక చిత్రంతో అందరిని అలరించనుంది.మొన్నామధ్య సైరా సినిమాలో గెస్ట్ రోల్ పోషించి విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.

అనుష్క, మాధవన్ లు ప్రధాన పాత్రలలో తెరెక్కుతున్న నిశ్శబ్దం చిత్రం నుండి నేడు మాధవన్ లుక్ ని రివీల్ చేశారు.ప్రకృతి వడిలో శబ్దాలకు దూరంగా వైలిన్ వాయిస్తూ సంగీత సాధనలో మునిగి తెలుతున్నట్లు ఆయన లుక్ అలరించేదిగా ఉంది. అంధుడైన గొప్ప మ్యుజీషియన్ గా ఆయన పాత్ర ఉంటుందేమో అనే ఉహాగణాల సమాచారం ప్రకారం తెలియనుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఎంతో కళాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క మూగదైన పెయింట్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.

ఐతే నిశ్శబ్దం చిత్రంలో ప్రధాన పాత్రల తీరు చూస్తుంటే కళాతపస్వి కె.విశ్వనాధ్ గారు 1986లో తెరకెక్కించిన సిరివెన్నెల చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో సుహాసిని మూగదైన పెయింటర్ పాత్ర చేయగా, సర్వదానం బెనర్జీ గుడ్డివాడైన గాయకుడి పాత్ర చేయడం జరిగింది. శారీరక లోపాలున్న వీరిద్దరూ ఒకరి కళలను ఒకరు గౌరవించడం,ప్రేమించడం వారి వ్యక్తిత్వాలను ఆరాధించడం ప్రధాన కథగా సాగిన ఈ చిత్రంలో టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా మనందరి హృదయాల్లో గుర్తుండి పోయింది.కెవి మహదేవన్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంతో మర్చిపోని ఒక జ్ఞాపకంలా పది పాటలు కలకాలం నిలిచిపోయాయి.

తాజా నిశ్శబ్దం చిత్రంలో కూడా అనుష్క మూగదైన పెయింటర్ గా కనిపిస్తుండగా మాధవన్ అంధుడైన మ్యూజిషియన్ పాత్ర చేస్తున్నారు. దీనితో సిరివెన్నెల మరియు నిశ్శబ్దం చిత్రాల మధ్య పాత్రలలో పోలిక కనిపిస్తుంది.అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ ఓ పాత్ర చేయడం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా అయినా కోనా వెంకట్ కి డబ్బులు మిగులుస్తుందేమో చూద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: