బాలీవుడ్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ ను తెచ్చి ఆరెక్స్ 100 అంటూ ఓ సినిమా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో పాయల్ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందం అభినయం రెండు పర్ఫెక్ట్ గా ఉన్న పాయల్ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస అవకాశాలను అందుకుంటుంది.


ప్రస్తుతం ఆర్.డి.ఎక్స్ లవ్ తో పాటుగా వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న వెంకీ మామ సినిమాలో కూడా నటిస్తుంది పాయల్. ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమాలో కూడా అమ్మడు గ్లామర్ పండించింది. సినిమా కాన్సెప్ట్ ఏమో కాని పాయల్ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా ఆమె స్కిన్ షో, హాట్ సీన్స్ ఉన్నట్టు ఉన్నాయి. 


ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమా టీజర్ రిలీజ్ కాగానే పాయల్ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. కొందరైతే ఆమెను ఏకంగా పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ పై పాయల్ క్లారిటీ ఇచ్చింది. ఎవరేం అనుకున్నా సరే తను చేసేదేంటో తనకు తెలుసని అందుకే ఎవరు ఎలా మాట్లాడినా పర్లేదని చెప్పింది పాయల్ రాజ్ పుత్.


ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్న ఈ అమ్మడు చూస్తుంటే టాలీవుడ్ లో టాప్ చెయిర్ దక్కించుకునేలా ఉంది. అయితే ఓ పక్క పాపులారిటీ వస్తున్నా హాట్ సీన్స్ లో నటించడం మాత్రం మానట్లేదు. పాయల్ సినిమా అంటే కనీసం ఒక ముద్దు సీన్ అయినా ఉండాల్సిందే అన్నట్టుగా ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే వారిని నిరాశపరచడం ఎందుకని పాయల్ రాజ్ పుత్ కూడా అందుకు సై అంటుంది.  అదే ఆమెకు సూపర్ ఫాలోయింగ్ తెచ్చిపెడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: