శ్రీవిష్ణు రోటిన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు . తనకు పాత్ర నచ్చితే చాలు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించాడు.  తెలుగు ప్రేక్షకులకి న్యా ఏజ్  సినిమాలు అందించడంలో ముందుంటాడు.  రీసెంట్ గా సమ్మర్ ఎండ్  లో వచ్చిన "బ్రోచేవారెవరురా" మంచి విజయన్ని సాధించింది. సగటు ఆడపిల్ల ఎదుర్కోనే ఒక సామాజిక అంశాన్ని తీసుకోని దానికి హ్యుమర్ జోడించి చూపించడంలో సఫలం అయ్యారు.ఈ సినిమాలో ఒక ఇంటర్ కుర్రాడి పాత్రలో నటించాడు. కామెడీ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు.


శ్రీ విష్ణు ప్రస్తుతం "తిప్పరా మీసం" అనే ఒక మాస్ మూవీ లో నటిస్తున్నారు. తిప్పరా  మీసం ఒక న్యా ఏజ్ రీవెంజ్ డ్రామా గా తెరకెక్కుతుంది . రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. .అందులో శ్రీ విష్ణు ఫుల్ బియర్డ్ తో ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. తిప్పరా మీసం  షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా ను త్వరలో విడుదల చేయడనికి ప్లాన్ చేస్తున్నారు.  అసురా ఫేం కృష్ణ విజయ్.ఎల్  దర్శకత్వం వహిస్తున్న తిప్పరా మీసం  సినిమాకు కు రిజ్వన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నీది నాది ఒకే కథ కు సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.


శ్రీ విష్ణు కొత్త సినిమాని ఒప్పుకున్నాడట. శ్రీ విష్ణు కెరియర్ లో మొదటి  సారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట.ఈ సినిమా ని ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ సినిమాకి శేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేయనున్నారు . ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుందట.ఈ  విషయాలపై అధికారిక ప్రకటన చేయలేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: