మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తొలిసారి మెగా, నందమూరి ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో కలిసి నటిస్తుండడంతో దీనిపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 

ఇక ఇటీవల బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో ప్రపంచవ్యాప్తంగా తన కీర్తి కిరీటాన్ని ఎగరవేసిన రాజమౌళి దీనికి దర్శకుడు కావడంతో, మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా దీనిపై మంచి హైప్ ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. పలువురు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫుల్ టైటిల్ ని నేడు సినిమా యూనిట్ ప్రకటించినట్లు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ని 

'రామ రౌద్ర రుషితం' అని యూనిట్  సభ్యులు నిర్ణయించినట్లు వార్తలు రాగా, నేడు ఆ టైటిల్ పోస్టర్ బయటకు రావడంతో సినిమా లవర్స్ అందరూ ఒక్కసారిగా ఆ టైటిల్ పోస్టర్ ని తమ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దాన్ని విపరీతంగా షేర్స్, లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. అయితే నిజంగా ఇది ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి వచ్చిన అధికారిక టైటిలా లేక కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ టైటిల్ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే, మరికొంత సమయం వేచి చూడాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: