2019 సంవత్సరంలో అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కిన సినిమాలు సాహో మరియు సైరా. సాహో సినిమా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా సైరా నరసింహా రెడ్డి సినిమా 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు కేవలం 32 రోజుల గ్యాప్ లో విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ రాగా సైరా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ భారీ స్థాయిలో కలెక్షన్లు రావటం లేదు. 
 
ఒకప్పుడు సినిమాలు 175 రోజులు, 100 రోజులు ఆడేవి. ఆ తరువాత కాలంలో సినిమాలు 50 రోజులు ఆడేవి. కానీ ప్రస్తుతం సినిమా విడుదలైతే కేవలం వారం రోజులు మాత్రమే ఆడుతున్నాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వారం రోజుల తరువాత సినిమాలకు భవిష్యత్తు ఉండటం లేదు. మరోవైపు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 లాంటి అప్లికేషన్లలో సినిమాలు విడుదలైన నెల రెండు నెలలకే హెచ్ డీ క్లారిటీలో అందుబాటులో ఉండటంతో సినిమాల రన్ తగ్గిపోవటంతో పాటు కలెక్షన్లు కూడా తగ్గుతున్నాయి. 
 
ఒక ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి ఒక సినిమా చూడాలంటే కనీసం 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అందువలన ప్రేక్షకులు కూడా సినిమాలకు భీభత్సమైన హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్ల వైపు చూడటం లేదు. మరోవైపు భారీ సినిమాలకు మొదటి వారం సాధారణ టికెట్ రేటు కంటే రేట్లు పెంచి అమ్ముతున్నారు. టికెట్ రేట్లు భారీగా ఉండటం కూడా వలన కూడా ప్రేక్షకులు కొంతమంది సినిమాలకు దూరమవుతున్నారు. 
 
నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు భారీగా నష్టాలు వస్తూ ఉండటం, హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగులుతూ ఉండటం గమనించాల్సి ఉంది. సినిమాను ఎన్ని కోట్లకు నిర్మించాలి ? ఎన్ని కోట్లకు అమ్మితే సినిమా హిట్టైనా ఫ్లాప్ ఐనా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ కాగలరు? మరియు ప్రేక్షకులు కూడా భారీ సినిమాలైనా సాధారణ టికెట్ రేట్లతోనే సినిమా టికెట్ కొనగలిగే పరిస్థితి ఇండస్ట్రీలో రావాల్సి ఉంది. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: