సీజన్ త్రీ తెలుగు బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఇంకా కొద్ది వారాలే మిగిలి ఉండటంతో ఇంటిలో ఉన్న సభ్యులంతా టైటిల్ గెలుచుకోవటానికి శతవిధాల ప్రయత్నాలు స్ట్రాటజీ లు వేసుకుంటున్నారు. మరోపక్క బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్ లు వేస్తున్న స్ట్రాటజీ లకు భిన్నంగా టాస్కలు ఇస్తూ షో పై ఆసక్తి రేపుతున్నరు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ త్రీ కె రొమాంటిక్ జంట గా పేరు తెచ్చుకున్నారు రాహుల్ పునర్నవి ల జంట. అయితే ఈ సారి జరిగిన సీజన్ త్రీ లో లాస్ట్ వీకెండ్ పునర్నవి హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే.


ఈ క్రమంలో ఎలిమినేట్ అయిన హౌస్ నుండి బయటకు వచ్చిన పునర్నవి ప్రస్తుతం పలు టీవీ వార్తా చానెల్లో ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఇంటర్వ్యూలలో బిజీబిజీగా గడుపుతోంది. ముఖ్యంగా హౌస్ లో ఉన్నంతకాలం రాహుల్ తో చాలా క్లోజ్ గా ఉన్న పునర్నవి ఎలిమినేట్ కాక ముందు రోజు రాహుల్ తో గొడవ పెట్టుకుని మాట్లాడటం మానేసి నా సంగతి అందరికీ తెలిసినదే.


అంతే కాకుండా కనీసం రాహుల్ తో ఫోటో దిగడానికి కూడా ఇష్టపడని పునర్నవి తాజాగా బయటకు వచ్చాక రాహుల్ మరియు వరుణ్ లను గెలిపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వారిద్దరినీ సపోర్ట్ చేస్తే వారిలో ఒకరికి టైటిల్ దక్కేలా పబ్లిసిటీ పీక్ స్టేజ్ లో చేస్తూ ప్రస్తుతం గడుపుతోంది. అంతేకాకుండా రాహుల్ అండ్ వరుణ్ కి సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టింది. పునర్నవి హౌస్ లో ఉన్నపుడు చాలా అగ్రెస్సివ్ గా ఎవరైనా చిన్న మాట అంటే సీరియస్ గా తీసుకునేది. బయటకి వచ్చాక కామ్ గా తన ఫ్రెండ్స్ ని గెలిపించడానికి ప్రస్తుతం బాగా కష్టపడుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: