తమ నిజ జీవితంలో మామ అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య, వెంకీ మామ అనే సినిమాలో ప్రస్తుతం అదే విధమైన మామ, అల్లుళ్ళ పాత్రల్లో నటిస్తున్నారు. యువ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల్లో సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే దసరా పండుగను పురస్కరించుకుని నిన్న రీలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ టీజర్, వీక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ప్రస్తుతం యూట్యూబ్ లో మూడు మిలియన్లకు పైగా వ్యూస్ తో దిగ్విజయంగా దూసుకుపోతోంది. 

ఒక మంచి హృద్యమైన కథగా, ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ అమాశాల కలగలుపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మామైన వెంకటేష్, మోతుబరి రైతు పాత్రలో నటిస్తుండగా, అల్లుడైన చైతు, దేశం కోసం మిలిటరీలో చేరే సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ మొత్తం మంచి ఫన్నీ గా మరియు యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది అనే చెప్పాలి. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఇటీవల ఎన్టీఆర్ తో తెరకెక్కించిన జైలవకుశ సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు బాబీ, 

ఈ సినిమాను కూడా మంచి సక్సెస్ చేసేలా అన్నివిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు భారీ ఖర్చుతో రూపొందిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఎనభై శాతానికి పైగా షూటిం ని పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి కెరీర్ లో తొలిసారి వెంకటేష్, చైతన్యలు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: