తెలుగు ప్రేక్షకులందరూ చూపుని ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్3 రియాల్టీ షో. బిగ్ బాస్ హౌస్ లో కాంటస్టెంట్స్ మధ్య జరిగే  కాంట్రవర్సీ గొడవలు,  బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో కంటెస్టెంట్స్ చేసే  రచ్చ  టెలివిజన్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. టాస్క్ లు నామినేషన్లు ఎలిమినేషన్ ల తో దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో కి వ్యాఖ్యాతగా  వ్యవహరిస్తూన్న నాగార్జున ... బిగ్ బాస్3 కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. అయితే తాజాగా దసరా పండుగ సందర్భంగా బిగ్ బాస్ 3 హౌస్ లోకి వెళ్ళిన నాగార్జున సందడి చేశారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి హౌస్ లోకి  నాగార్జున ఎంట్రీ సర్ ప్రైజ్ ఇచ్చింది. 

 

 

 

 

 ఇక నాగార్జున హౌస్ లోకి రావడంతో హౌస్ లోని సభ్యుల అందరూ నాగార్జున గెటప్ చూసి ఫిదా అయిపోయారు.ఇక  నాగార్జున రాకతో హౌస్ లో  సందడి డబుల్ అయింది. హౌస్ లోని కంటెస్టెంట్స్ తో నాగార్జున దసరా రోజు ఏ కాకుండా... నిన్నటి ఎపిసోడ్ లో   సందడి చేశారు. హౌస్ కంటెస్టెంట్స్ తో  పలు రకాల ఫన్నీ  గేమ్స్ ఆడిస్తూ అటు కంటెస్టెంట్స్ నే కాకుండా... ఇటు టీవీ చూస్తున్న ప్రేక్షకులను కూడా అలరించారు నాగార్జున . హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున... ట్రెడిషనల్ లుక్కుతో రావడంతో అందరూ నాగార్జున గెటప్ చూసి ఫిదా అయిపోయారు. ఇక కంటెస్టెంట్స్ తో పాటలు పాడించడం డాన్సులు వేయించడం టాస్కులు  చేయించడం అబ్బో బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చేసిన సందడి మామూలుగా లేదంటే నమ్మండి. ఇక శ్రీముఖుని బెల్లీ డాన్స్ చేయమని టాస్క్ ఇవ్వగా ... ముందు తనకు రాదు అని చెప్పిన శ్రీముఖి... ఆ తర్వాత రొమాంటిక్ సాంగ్ పై బెల్లీ డాన్స్ చేసి బిగ్ బాస్ హౌస్ ని షేక్  చేసింది. 

 

 

 

 

 

 ఈ సందర్భంగా హౌస్ లోని కంటెస్టెంట్ లకి  స్టార్ ఆఫ్ ది హౌస్ ఎవరని పోటీ పెట్టారు. ప్రతి ఒక్క హౌస్ మెట్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు స్టార్ ఆఫ్ ది హౌస్ అని అనుకుంటున్నారో  తమ  అభిప్రాయాన్ని చెప్పాలి అని చెప్పాడు. ఎవరికి ఎక్కువ స్టార్స్ వస్తే వారికి స్టార్ ఆఫ్ ది హౌస్ అని నిర్ణయిస్తామని నాగార్జున తెలిపారు . ఈ నేపథ్యంలో ఆలీ శివ జ్యోతి కి స్టార్ ఆఫ్ ది హౌస్ అని చెప్పగా... శివ జ్యోతి అలికి స్టార్ ఆఫ్ ది హౌస్ ఇచ్చింది.... ఇక బాబా భాస్కర్ శ్రీమతి కూడా ఒకరికొకరు స్టార్ ఆఫ్ ది హౌస్ ఇచ్చుకున్నారు. ఇక రాహుల్ వితిక వరుణ్ సందేశ్ కి స్టార్ ఆఫ్ ది హౌస్ అని చెప్పగా.... మహేష్ విట్ట శివజ్యోతి స్టార్ ఆఫ్ ది  హౌస్ అని చెప్పారు. ఇక వరుణ్ సందేశ్ వితిక ని స్టార్ ఆఫ్ ది హౌస్ గా చెప్పారు. దీంతో రెండు స్టార్ లు  సొంతం చేసుకున్న శివ జ్యోతి వరుణ్ సందేశ్ లను  స్టార్ ఆఫ్ ది హౌస్ గా నిర్ణయించారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: