ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలో చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందినా అప్పట్లో చిరంజీవి ఆ ప్రమాణస్వీకారానికి హాజర్ అవ్వకపోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు గత కొన్ని రోజులుగా చిరంజీవి భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నాడు అంటూ వార్తలు కూడ వచ్చాయి.

ఇలాంటి పరిస్థితులలో ‘సైరా’ విడుదల సమయంలో ఈ మూవీకి అదనపు షోలు వేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి నిముషం వరకు ఎటూ తేల్చక చిరంజీవికి విపరీతమైన టెన్షన్ ను తెప్పించింది. అయితే చిరంజీవి చేసిన రాయబారాలు ఫలించడంతో ఆఖరి నిముషంలో ‘సైరా’ స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 

ఇప్పుడు ‘సైరా’ విడుదలై రెండవ వారంలోకి అడుగు పెట్టిన నేపధ్యంలో ఈ మూవీ స్పెషల్ షోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ మూవీని చూడవలసిందిగా జగన్ ను కోరడానికి రేపు చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి అమరావతి వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి అభ్యర్ధనను జగన్ అంగీకరిస్తే జగన్ కోసం విజయవాడలో సైరా స్పెషల్ షోను ప్రదర్శించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి తాను రాజకీయాలను పూర్తిగా వదిలేసాను అని చెపుతున్నా చిరంజీవిని ఎదో ఒక పొలిటికల్ పార్టీతో లింక్ చేస్తూ వార్తలు వస్తున్న నేపధ్యంలో తాను అందరివాడిని అన్న క్లారిటీ ఇవ్వడానికి చిరంజీవి ఇలా ప్రత్యేకంగా వచ్చి జగన్ ను కలుస్తున్నాడని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కూడ చిరంజీవి త్వరలోనే ‘సైరా’ స్పెషల్ షోకు ఆహ్వానించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రెండవ
వారంలోకి వచ్చిన ‘సైరా’ కలక్షన్స్ దాదాపు 70 శాతం వరకు ఫుల్ అవుతున్నాయి అని వస్తున్న వార్తలను బట్టి ‘సైరా’ ప్రమాదం నుండి బయటపడింది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: