మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' సినిమాకు ప్రేక్షకులతో పాటు, సినిమా ఇండస్ట్రీ నుండి భారీ ఆదరణ దక్కిన నేపథ్యంలో కళాబంధు టీ. సుబ్బరామి రెడ్డి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సక్సెస్ పార్టీ ఇచ్చారు.  ఈ పార్టీలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. బయట ఎవరు ఎన్ని మాట్లాడుకున్న బాలయ్య-చిరుల మధ్య ఉండే అనుబంధం ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అంతేకాదు వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం బయటపడుతుంటుంది. ఇక ఈ సక్సస్ వేడుకలో 'సైరా' టీమ్ సభ్యులతో పాటుగా టి.సుబ్బరామి రెడ్డి.. మురళి మోహన్..ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్..మరో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. దిల్ రాజు..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో పాటు మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సక్సెస్ పార్టీ సూపర్ సక్సెస్ అని.. మెగాస్టార్ ఈ పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేశారని చెప్పుకుంటున్నారు.  అంతేకాదు వచ్చిన అతిథులందరితోను ముచ్చట్లాడుతూ చిరు ఎంతో సరదాగా గడిపారట. అయితే ఈ పార్టీలో అందరినీ ఆకర్షించిన విషయం మరొకటి కూడా తాజాగా బయటకు వచ్చింది. ఈ పార్టీలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ ను చిరు అసలు వదలలేదట. ఈ పార్టీలో ఇద్దరి సాన్నిహిత్యం చూసిన వారికి ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న అభిప్రాయం కలిగిందట. వాస్తవంగా చూస్తే మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఛాన్స్ పూరి జగన్నాధ్ కే వచ్చేది. చిరు కోసం పూరి అప్పట్లో 'ఆటో జానీ' కథను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కథ చిరు సోదరుడు నాగ బాబుకి, చిరు తనయుడు రాం చరణ్ కి కూడా బాగా నచ్చిందట. 

కానీ సెకండ్ హాఫ్ విషయంలో చిరు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే చిరు ఆ విషయం డైరెక్ట్ గా పూరి తో చెప్పకుండా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో పూరి బాగా అప్సెట్ అయ్యాడు. తర్వాత చరణ్ సర్ది చెప్పడంతో ఆ ఇష్యూ అంతటితో ఆగిపోయింది. మెగాస్టార్ తో ఎప్పటికైనా సినిమా తెరకెక్కించాలన్నదే తన డ్రీమ్ అని చాలా సందర్భాలలో పూరి చెపుతూనే ఉన్నారు. కానీ ఆయన ఫామ్ లో లేకపోవడంతో దాని సంగతి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్' తో పూరి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు కాబట్టి ఫ్యూచర్ లో ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక పూరి స్టామినా గురించి మెగాస్టార్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే చరణ్ ని హీరోగా లాంచ్ చేసింది పూరీ నే కాబట్టి. అంతేకాదు పూరి మెగా హీరోలందరితోని సినిమాలు తీశాడు. సో ఇవన్ని చూస్తే పక్కా చిరు-పూరి కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: