టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మధుడు 2, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం విజయ్ భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో హీరో నాగార్జున కొంత ఆలోచనలోపడ్డారు. 

అందుకే తన తదుపరి సినిమా విషయమై కొంత గ్యాప్ తీసుకున్న నాగ్, అతి త్వరలో బంగార్రాజు అనే సినిమాలో నటించనున్నారు. రెండేళ్ల క్రితం యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమా మంచి హిట్ కొట్టడంతో పాటు, ఆ సినిమాలో ఆయన పోషించిన బంగార్రాజు పాత్రకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు సీక్వెల్ గా త్వరలో బంగార్రాజును తెరకెక్కించనున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా కథ విషయమై కొన్నాళ్ల నుండి ఎంతో కసరత్తు చేసిన దర్శకుడు కళ్యాణ్, 

ఎట్టకేలకు పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా, అతి త్వరలో లాంఛనంగా ప్రారంభం కానుందట. నాగార్జున సరసన ఒక ప్రముఖ హీరోయిన్ నటించబోయే ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా ప్రారంభం రోజునే తెలియనున్నాయి. మరి మన్మధుడు 2 తో ఢీలాపడ్డ నాగ్, ఈ సారి చేయబోయే బంగార్రాజుతో ఎంత మేర హిట్ అందుకుంటారో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: