అమాయకంగా కనిపించే సమంతలో బయటపడని విలనిజం ఉంది  అంటే ఎవ్వరు నమ్మరు. ఎప్పుడు సరదాగా జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తూ సోషల్ మీడియాలో తెగసందడి చేసే సమంత ప్రస్తుతం  ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ నిర్మాణం చేసిన విషయం తెలిసిందే.  

మనోజ్ భాజ్ పాయ్ ప్రియమణి లాంటి స్టార్లు ఈ వెబ్ సిరీస్ లో  నటిస్తున్నారు. ఒక సినిమాని మించి ఈ వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఇంకా పూర్తి కాకుండానే మరో వెబ్ సిరీస్ కోసం సమంత కొంత మంది దర్శకులతో సంప్రదింపుల జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కొత్త వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ పాత్రను పోషించబోతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ‘ఓ బేబి’ సాధించిన విజయంతో మంచి జోష్ లో ఉన్న సమంతకు ఈ మధ్య ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన ఒక నెగిటివ్ షేర్ క్యారెక్టర్ బాగా నచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథలో సమంత చాల భంకరమైన లేడీ విలన్ గా నటించపోతున్నట్లు టాక్. 

కేరళాలో జరిగిన ఒక యదార్ధ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ యంగ్ డైరెక్టర్ ఈ కథను అల్లి సమంతకు వినిపించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకున్న హీరోయిన్స్ పూర్తి నెగిటివ్ షెడ్ తో ఉండే నెగిటివ్ పాఠాలను పోషించిన సందర్భాలు చాల అరుదు. ఇప్పుడు సమంత ఇలా ఊహించని తార్న్ తీసుకోవడంతో సమంత విలనిజం చూసి అక్కినేని కాంపౌండ్ కూడ షేక్ అవుతున్నట్లు జోక్స్ పడుతున్నాయి. ప్రస్తుతం సమంత అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తూ ఉంటే రానున్న రోజులలో సమంత నిర్మాతగా మారి తన అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో చిన్న సినిమాలు చాల తీసి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: