క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఏమి చేసినా చాల విభిన్నంగా ఉంటుంది. అతడి మాట తీరు మాత్రమే కాదు బాడీ లాంగ్వేజ్ కూడ డిఫరెంట్. అందువల్లనే అతి తక్కువ కాలంలో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రముఖ  ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఫోన్ నెంబర్ కోసం తాను పడ్డ పాట్లను చాల సరదాగా వివరించాడు. 

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ కు దేశ వ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు. ఆ లిస్టులో విజయ్ దేవరకొండ కూడ ఒకడు. ఆ మధ్య అలియా భట్ నటించిన ‘గల్లీ బాయ్’ సినిమాను విజయ్ చూసాడట. ఆ మూవీ చూసిన వెంటనే విజయ్ కు అలియా భట్ తో వెంటనే ఫోన్ లో మాట్లాడాలని అనిపించిందట.

అయితే అప్పటికి సమయం అర్ధ రాత్రి అయినా పట్టించుకోకుండా అలియా భట్ కు అత్యంత సన్నిహితుడైన కరణ్ జోహార్ కు ఆ రాత్రి సమయంలో ఫోన్ చేసి తనకు అలియ భట్ ఫోన్ నెంబర్ కావాలి అంటూ హడావిడిగా అడిగాడట. దానికి షాక్ అయిన కరణ్ జోహార్ ఇలాంటి అర్దరాత్రి సమయంలో అలియా భట్ కు ఫోన్ చేస్తే ఎదుటివాడు ఎవరు అని చూడకుండా అలియా తిట్లు తిడుతుంది అంటూ విజయ్ ఆవేశాన్ని చల్లార్చాడట. 

ఆ తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్న అలియా భట్ ఒక ఫంక్షన్ లో  విజయ్  ని కలిసినప్పుడు ఎంత అభిమానం ఉన్నా అర్దరాత్రి ఒక అమ్మాయికి ఫోన్ చేయకూడదని తెలియదా అంటూ అలియా విజయ్ కి చురకలు అంటించిందట. వాస్తవానికి అలియా ఎలాంటి పెద్ద హీరోలను కూడ లెక్క చేయదు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో తాను కేవలం రాజమౌళి పట్ల ఉన్న గౌరవంతో నటిస్తున్నాను అని చెప్పి ఏకంగా చరణ్ జూనియర్లకు అలియా చుక్కలు చూపించిన విషయం అందరికీ తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: