త‌మ‌న్నా  సినీ ప్రస్థానం లో  అప్పుడే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు  . ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది,మెప్పించారు మిల్కీ బ్యూటీ  త‌మ‌న్నా. తెలుగుతో పాటు పలు భాషలు అయిన  త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుకుంటూ,తన కంటూ  ఓ ప్రత్యేకమైన స్థానం ని సొంతం చేసుకున్నారు  త‌మ‌న్నా.

ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. తాజాగా కుందనపు బొమ్మలా తయారయిన  తమన్నా తన  లేటెస్ట్ పిక్స్ తో  నెటిజన్స్ మతి పోగొడ్తున్నారు.
హ్యాపీ డేస్ సినిమా తో  తెలుగులో సినీ ప్రవేశం చేసి,తరువాత తనకి అంది వచ్చిన ప్రతి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగి పోయి..అన్ని ప్రముఖ భాషలో నటించి,బాలీవుడ్ లో కూడా ఈమధ్య నటిస్తూ అక్కడ కూడా తన అభినయం తో అందరిని ఆకట్టుకుంటూ,టాప్ ఫిమేల్ యాక్టర్స్ లిస్ట్ లో కచ్చితంగా  మొదటి పది స్థానాలలో తప్పకుండా తమన్నా ఉంటారు.

సినిమాలు మాత్రమే కాకుండా అటు యాడ్స్ లో కూడా తళుక్కుమని మెరిసి మురిపిస్తున్నారు. తాజాగా  చిరంజీవి గారు నటించిన ప్రతిష్ఠాత్మకమైన సైరా నరసింహ రెడ్డి లో  తాను కూడా నటించారు తమన్నా.తన పాత్ర  నిడివిడి ని  తక్కువ ఉన్నా దానిని పక్కన పెట్టి, చిన్న క్యారెక్టర్ అయిన  అలంటి గొప్ప ప్రతిష్ఠాత్మకమైన మూవీ లో తాను ఉండాలనే కోరికతో ఒప్పుకున్నారు.అయితే ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవటం తమన్నా ఖాతా లో మరో విజయం చేరింది. 

సైరా లో చిరంజీవి గారు తరువాత అంత పేరు వచ్చిన క్యారెక్టర్ అంటే అది తమన్నాదే  అంటున్నారు సినీ ప్రేక్షకులు .తాజాగా సైరా సక్సెస్ మీట్ లో కూడా చిరంజీవి గారు ఆమె అభినయానికి ఫ్యాన్ అయిపోయాను,చాలా  మంచి క్యారెక్టర్ తనది తమన్నా అంటే గ్లామర్ డాల్ అనేవారు ఇప్పటి నుండి ఆమె పెర్ఫార్మన్స్ స్టార్  అని  పిలుస్తారు,సినిమాలో అని ఆమె నటన అద్భుతం అని చెప్పి కొనియాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: