తమన్నా.. ఈ పేరు వినాగానే ప్రేక్షకుల మదిలో.. మిల్క్ బ్యూటీ, గ్లామర్ డాల్, బ్యూటీ డాల్ అని మాత్రమే గుర్తొస్తుంది. కానీ., సైరాలో తాను పోషించిన అద్భుతమైన పాత్రకు యావత్ తెలుగు ఇండస్ట్రీతో శభాష్ అనిపించుకుంది.. మొన్న జరిగిన సక్సెస్స్ మీట్ లో ఈ అందాల బొమ్మ గురించి చిరు చేసిన చిరు వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం..

సైరా నరసింహా రెడ్డి సినిమాలో తమన్నా పాత్ర నిడివిని పక్కన బెడితే ఆమె చేసిన ఆ క్యారెక్టర్ పవర్ అంతాఇంతా కాదని.., నా సంగతి అటుంచితే తర్వాత అంత పేరొచ్చిన క్యారెక్టర్ తమన్నాకే అని..,, అసలు తమన్నాలో ఈ యాంగిల్ కూడా ఉందా..? అనిపించేంతల ఒక మరచిపోలేని అద్భుత పాత్ర చేసిందని..,, కేవలం సినిమాలోనే కాకుండా ప్రత్యేకించి ప్రమోషన్స్‌లో కూడా తమన్నా పాల్గొనడం చిత్రయూనిట్ అభినందించదగిన విషయమని.., సైరా సినిమాను ఓన్ చేసుకుని..,, సైరా ప్రమోషన్స్ ఎక్కడ జరిగినా  ఆమెనే ముందుండి  అన్ని ఏరియాల్లో పర్యటించిందని..,, తమన్నా గురించి చెప్పి గర్వపడ్డారు.

ఒక సినిమా కోసం తమన్నా చూపిన ప్రొఫెషనలిజం, డెడికేషన్ అంతాఇంతా కాదని.., నేటితరం హీరోయిన్లకు తమన్నా ఒక ఆదర్శం కాదు.. తమన్నా ఒక అద్భుతం అని చిరంజీవి అన్నారు. దీంతో తమన్నా ఆనందానికి హద్దులులేకుండా పోయాయి. వెంటనే తన చేతులు జోడించి నమస్కరించింది తమన్నా.

ఇక ఈ కార్యక్రమంలో వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, నిహారిక, కేథరిన్, అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్, సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొని ఈ సంబరాన్ని ఎంతో ఆనందంగా పురస్కరించుకున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: