టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ఇటీవల గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో తొలిసారి ఒక స్వాతంత్రోద్యమ వీరుడిగా నటించిన ఈ సినిమాను దాదాపుగా రూ.275 కోట్ల ఖర్చుతో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఆయన తనయుడు రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా మరొక హీరోయిన్ గా నటించగా, అనుష్క, నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రల్లో నటించడం జరిగింది. 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో పలువురు ఇతర భాషలకు చెందిన దిగ్గజ నటులు కూడా నటించారు. అయితే మొదటి నుండి ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెంచిన ఈ సినిమా, రిలీజ్ తరువాత కేవలం యావరేజ్ టాక్ మాత్రమే సంపాదించింది. సినిమాలో మెగాస్టార్ నటన బాగున్నప్పటికీ, అత్యధిక రన్ టైం, మధ్యలో ల్యాగ్స్ ఉండడం, పెద్దగా ఆకట్టుకోని ఎమోషనల్ సన్నివేశాలు, అలానే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ తేలిపోయినట్లు ఉండడం వంటివి ఈ సినిమాకు కొంత నష్టం కలిగించాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయమై ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. నిజానికి తమ సినిమా అధికారిక కలెక్షన్స్ ని ప్రకటించడం జరగదని ఇది వరకే నిర్మాత రామ్ చరణ్ ప్రకటించారు. 

ఇక రిలీజ్ రోజు దగ్గరినుండి ఈ సినిమా రాబడుతున్న కలెక్షన్స్ విషయమై బయటకు వస్తున్న ఫిగర్స్ మొత్తం ఫేక్ అని కొందరు ప్రేక్షకులు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో నానా రచ్చ చేస్తున్నారు. కొందరు అవి కరెక్ట్ ఫిగర్స్ అని చెప్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం వాటిని తప్పుపడుతున్నారు. అయితే ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, ఈ సినిమా చాలా చోట్ల నష్టాలు మిగిల్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా మాత్రం తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు బాగానే దెబ్బ పడేలా ఉందని అంటున్నారు. మరి సైరా కలెక్షన్స్ విషయమై జరుగుతున్న ఈ వివాదం ఎప్పటికి సర్దుకుంటుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: