ఇటీవల విడుదలైన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా౹౹టి. సుబ్బిరామిరెడ్డి బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించి.. 'సైరా' బృందాన్ని సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ..‘‘చిరంజీవిగారి గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగిందని., ఇంత పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం అని.., హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్., చిరంజీవిగారు లేకుండా రామ్ చరణ్ లేరు., గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తెలుగువాళ్లందరూ గర్వంగా ఫీలయ్యే సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

సైరా లాంటి పెద్ద సినిమాను సురేందర్‌రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారు.. అయిన చిరంజీవి గారు చాలా లక్కీ.,, డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు ఖర్చుపెట్టడం, ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా హ్యాట్సాఫ్ టు యు అండ్ గ్రేట్ అన్నారు. అందరూ ఈ వయసులో అని అంటున్నారు - కానీ! సినిమా చూసినప్పుడు నాకు ఆయన వయసు కనిపించలేదు.., ఆ స్పీడ్ అంతా ఎప్పటిలాగే అనిపించింది అని రాజశేఖర్ అన్నారు.

తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్. ఇలాంటి కార్యక్రమం సుబ్బిరామిరెడ్డిగారు మాత్రమే ఏర్పాటు చేయగలరు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అని రాజశేఖర్ కొనియాడారు. గతంలోని వివాదాలు మరిచిపోయి రాజశేఖర్ ఇలా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకొన్నది.

సైరా కార్యక్రమంలో సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, నిహారిక, అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్,సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి చిరంజీవి మీద అభిమానంతో ‘సైరా' ప్రత్యేక కేక్‌ను తయారు చేయించి మెగాస్టార్‌కు బహూకరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: