ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేక సార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన ప్రతిసారి ప్రభాస్ అనుష్కలు ఖండిస్తూ తమ మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదనీ కేవలం తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ నెల 19న లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరగబోతున్న ‘బాహుబలి’ ప్రత్యేక ప్రదర్శన మరొకసారి వీరిద్దరి సాన్నిహిత్యం పై వార్తలకు తావు ఇవ్వబోతోంది.

ఈ ఈవెంట్ జరిగిన తరువాత కేవలం నాలుగు రోజులలో ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఈ పుట్టినరోజుతో ప్రభాస్ 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. వాస్తవానికి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం  ప్రభాస్ కు ఏమాత్రం ఇష్టం ఉండదు. 

గడిచిన పుట్టినరోజులు అన్నీ ప్రభాస్ తన ఇంటిలోనే ఎటువంటి హడావిడి లేకుండా తన సన్నిహితులతో చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే లండన్ లో ‘బాహుబలి’ ఈ వెంట్ తరువాత ప్రభాస్ మరికొద్ది రోజులు లండన్ లోనే ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు వచ్చిన రాజమౌళి రానా అనుష్క కీరవాణిలు ప్రభాస్ పుట్టినరోజు అయ్యేదాకా లండన్ లోనే ఉండిపోతారా లేకుంటే రాజమౌళి కీరవాణిలు ఇండియాకు రిటర్న్ అయిపోతే అనుష్క రానాలు మాత్రం లండన్ లో ఉండిపోతారా అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు అని అంటున్నారు. 

ఇదే జరిగి అనుష్క రానాలు ప్రభాస్ పుట్టినరోజు కోసం లండన్ లో ఉండిపోతే మళ్ళీ ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై వార్తలు గుప్పుమనే ఆస్కారం ఉంది. దీనికితోడు ప్రభాస్ తన రాబోతున్న పుట్టినరోజునాడు లండన్ కు దగ్గరలో ఉన్న ఒక హాలిడే రిజార్ట్ లో ఉండబోతున్నట్లు టాక్. దీనితో ప్రభాస్ అనుష్కల పై మళ్ళీ వార్తలు గుప్పుమనడానికి ‘బాహుబలి’ లండన్ ఈవెంట్ పరోక్షంగా సహకరిస్తోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: