న్టీఆర్ బయోపిక్ పరాభవం తరువాత బాలకృష్ణ కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో  నటిస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ‘రూలర్’ ‘రాయలసింహా’ తో సహా అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా ‘రూలర్’ అన్న టైటిల్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చడంతో ఆ టైటిల్ వైపే నిర్మాతలు ఇష్ట పడ్డారు.

అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ మూవీకి ‘జడ్జిమెంట్’ అన్న టైటిల్ దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా ఈ మూవీ టైటిల్ మారడం వెనుక బాలయ్య సలహాలు ఉన్నాయి అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బోయపాటిల కాంబినేషన్ లో వచ్చిన ‘దమ్ము’ మూవీలో ఒక పాటలో ‘రూలర్’ అన్న పదం ఉంది.

ఈ పాటతో పాటు ఈ పదం కూడ బాగా పాపులర్ కావడంతో గతంలో ఒకసారి జూనియర్ తన సినిమాకు ‘రూలర్’ అన్న టైటిల్ ను పెట్టుకుంటాడు అన్న ప్రచారం కూడ జరిగింది. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ బహుశా బాలకృష్ణకు గుర్తుకు వచ్చి ఉంటాయి. అందువల్లనే తన మూవీ టైటిల్ జూనియర్ పాటలోని పదాన్ని కాకుండా ‘జడ్జిమెంట్’ గా మార్చి ఉంటాడు అన్న ప్రచారం జరుగుతోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని కూడ వారం మధ్యలో వచ్చే బుధవారంనాడు డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆరోజు క్రిస్మస్ కావడంతో ఆ పండుగను టార్గెట్ చేస్తూ సంక్రాంతికి బదులు బాలయ్య ఈసారి క్రిస్మస్ హీరో కాబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎటువంటి క్రేజ్ ఏర్పడక పోయినా ఈ మూవీలో కనిపించే తన డిఫరెంట్ లుక్ మరియు బాడీ లాంగ్వేజ్ తో ఈ మూవీకి రానున్న రోజులలో మంచి క్రేజ్ ఏర్పడుతుందని బాలయ్య మంచి నమ్మకం మీద ఉన్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: