‘సైరా’ విడుదలై 10 రోజులు దాటి పోయినా ఈ మూవీ కలక్షన్స్ గురించి ఎటువంటి అధికారిక సమాచారాన్ని రామ్ చరణ్ లీక్ చేయడం లేదు. దీనితో ఈ మూవీ కలక్షన్స్ విషయమై కేవలం ఊహాగానాలు మాత్రమే హడావిడి చేస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటికే 200 కోట్ల కలక్షన్స్ ను క్రాస్ చేసింది అంటూ వార్తల హడావిడి జరుగుతూ ఉన్నా ఈ విషయమై కూడ మెగా కాంపౌండ్ స్పందించడం లేదు. 

చిరంజీవి చరణ్ లు ఈ సినిమా రికార్డుల కోసం తీసింది కాదు అని చెపుతూ ఈ మూవీని ఎంత వరకు ప్రమోట్ చేయాలో అంత వరకు ప్రమోట్ చేసి ఈ వారాంతంలో కూడ ‘సైరా’ కలక్షన్స్ విషయంలో నిలబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో #SyeRaaFakeCollections అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ కింద కొన్ని పోస్టులలో కొన్ని బుక్ మై షో ఎడ్వాన్స్ బుకింగుల ఇమేజిలను పోస్ట్ చేస్తున్నారు. 

మరి కొందరైతే ‘సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చినప్పుడుఒక ఫిగర్స్ లీకులు ఇచ్చి ఇప్పుడు ఆ ఫిగర్స్ ను ఎందుకు మెగా కాంపౌండ్ తగ్గించేసింది అంటూ మెగా కాంపౌండ్ పై చురకలు వేస్తున్నారు. దీనికి ఉదాహరణగా మొదట్లో ‘సైరా’ ఓవర్సీస్ రైట్స్ ను నాలుగు మిలియన్ డాలర్లకు అమ్మకం జరిగిందని ప్రచారం చేసి ఇప్పుడు హఠాత్ గా ఆ ఫిగర్స్ ను మూడు మిలియన్ డాలర్స్ కు ఎందుకు తగ్గించివేసారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరి కొందరైతే ‘సైరా’ గ్రాస్ కలక్షన్స్ ను నెట్ కలక్షన్స్ గా చూపెట్టి ఈ మూవీని హిట్ అన్న ప్రచారం చేస్తున్నారని అంటూ విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంత నెగిటివ్ ప్రచారం ‘సైరా’ కలక్షన్స్ పై జరుగుతున్నా మెగా కాంపౌండ్ ఒక్కమాట కూడ మాట్లాడటం లేదు. దీనికితోడు ‘సైరా’ ను మన హైదరాబాద్ బెంగుళూరులలో ఉన్న ఆర్మీ క్యాంప్ లలోని మన సైనికులు కోసం ఏకంగా 60 స్పెషల్ షోలు వేసి మన సైనికులలో మరింత దేశభక్తి కలిగించడానికి ‘సైరా’ ను ఒక ఆయుధంగా మారుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: