తమిళనాడు రాష్ట్రంలో ఇళయదళపతి విజయ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తరువాత కోలీవుడ్ లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న నటుడు కేవలం విజయ్ మాత్రమే. విజయ్ కు హీరోగా మాత్రమే కాకుండా తమిళనాడు రాష్ట్రంలో ప్రకృతి వైపరిత్యాలు వచ్చిన సమయంలో తన వంతు సహాయం చేస్తాడని, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాడని మంచి పేరుంది. విజయ్ తన అభిమానులపై కూడా ఎంతో అభిమానం చూపిస్తాడనే మంచి పేరుంది. 
 
విజయ్ తన అభిమానులకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించిన సందర్భాలు మరియు అభిమానుల క్షేమ సమాచారాలు తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక తమిళ దర్శకుడు మాత్రం హీరో విజయ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ లో అందరు చూసింది ఒక కోణం మాత్రమేనని విజయ్ లో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉందని ఆ కోణం తెలిస్తే విజయ్ అభిమానులు కూడా షాక్ అవుతారని సామి అనే దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 
విజయ్ అభిమానులు అందరూ విజయ్ ఎంతో సౌమ్యుడు అని అనుకుంటారని కాని అది నిజం కాదని విజయ్ తన అభిమానుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తాడని సామి అన్నారు. తన అభిమానులపై విజయ్ చూపించే ప్రేమ అంతా నాటకమేనని అన్నారు. అభిమానులు విజయ్ ప్రేమను నమ్మొద్దని తన సినిమా కలెక్షన్ల కోసమే విజయ్ అలా ప్రేమను కురిపిస్తాడని అన్నారు. 
 
అభిమానులు విజయ్ కు చాలా నీచంగా కనిపిస్తారని షేక్ హ్యాండ్ ఇచ్చాక విజయ్ డెటాల్ తో తన చేతిని శుభ్రం చేసుకుంటాడని సామి అన్నారు. ఈవెంట్స్ కు హాజరైన సమయంలో విజయ్ చాలా అనవసరమైన మాటలు మాట్లాడతారని అలాంటి మాటలు విజయ్ తగ్గించుకోవాలని సామి అన్నారు. సామి చేసిన ఈ వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో ఈ దర్శకుడు సింధు సామవేళి అనే వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: