అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘అలా వైకుంఠపురంలో’ నటిస్తున్న పూజా హెగ్డే టబుల పాత్రలు చాల వ్యక్తిత్వంతో కూడుకున్న పాత్రలుగా త్రివిక్రమ్ దిజియన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో నటిస్తున్న పూజా హెగ్డే నటనకు సంబంధించిన టాలెంట్ ను బయటపెట్టే మూవీగా ఈ మూవీ ఉంటుంది అని అంటున్నారు.

రేపు పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఈమూవీలో ఆమె సాఫ్ట్ వేర్ కంపెనీ సియివో లుక్ కు సంబంధించిన ఫోటోలను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఒక కార్పోరేట్ కంపెనీ సియివో లుక్ అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ చాల హుందాగా ఉండే విధంగా త్రివిక్రమ్ ఈమె పాత్ర కోసం చాల జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. 

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్ కేవలం గ్లామర్ ఎక్స్ పోజింగ్ డాలస్ గా కనిపించకుండా ఆ పాత్రలకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండేలా త్రివిక్రమ్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అదే పద్ధతి ఈ సినిమాకు సంబంధించి పూజా హెగ్డే విషయంలో కూడా త్రివిక్రమ్ అనుసరించాడు అని వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాట ‘సామజ వరగమన’ ట్యూన్ కు యూత్ బాగా కనెక్ట్ అయిన నేపధ్యంలో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తోంది. ఈ మూవీ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ తో పోటీ పడుతున్న పరిస్థుతులలో ఈ మూవీకి హైక్ తీసుకు రావడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు త్రివిక్రమ్ అనుసరిస్తున్నాడు. ప్రస్తుతం బన్నీకి ఒక సూపర్ హిట్ కావలసి ఉన్న నేపధ్యంలో ఈ మూవీ విషయమై త్రివిక్రమ్ తన సర్వశక్తులు ధారపోసి ఈ మూవీని సంక్రాంతి విజేతగా తీర్చిదిద్దాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: