ఇంకా మరో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికీ ఇంకా 8 మంది కంటెస్టెంట్స్ ఇంట్లో మిగిలి ఉన్నారు. అందులో చాలా మంది వచ్చే 2 వారాల్లో బయటికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పోటీ మాత్రం ముఖ్యంగా ముగ్గురు మధ్యే ఉంది అనిపిస్తుంది. వాళ్లలోనే ఎవరో ఒకరు టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు తెలుగు ప్రజలు. బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ లో అందరికంటే ముందు టైటిల్ రేస్‌లో ఉన్నది యాంకర్ శ్రీముఖినే. ఈమెకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా అంటే భారీగా పెరిగిపోయింది. ఖచ్చితంగా ఈ సారి టైటిల్ కొట్టాలని కసితో కనిపిస్తుంది యాంకర్ శ్రీముఖి. దీనికితోడు ఇంట్లో భారీగా క్రేజ్ ఉన్న నటి కూడా ఈమె.


ఎంత మంచివాడవురా అంటూ అందరితోనూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మన టాలీవూడ్ హీరో, అమెరికా బుల్లోడు వరుణ్ సందేశ్. ఇప్పటి వరకు చాలా సార్లు నామినేషన్స్‌లోకి వచ్చినా కూడా బయటపడ్డాడు ఈ హీరో. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న వరుణ్ సందేశ్ ఈ సారి బయటపడితే ఫైనల్ వరకు వస్తాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక పోతే ఈయన భార్య వితికా ఇన్ని రోజులు హౌజ్‌లో ఉండటమే అద్భుతం అని సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ పేలుతున్నాయి. భార్యాభర్తలు కలిసి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ల రొమాన్స్ వర్కవుట్ అవుతుందని వితికను ఎలిమినేట్ చేయకుండా ఉంచారనే విమర్శలు కూడా బాగా వినిపిస్తూన్నాయి. ప్రస్తుతం ఈమె ఫైనల్ రేస్ వరకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.


ఈ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన యాంకర్ శివ జ్యోతి వరసగా అన్ని వారాలు దాటుకుంటూ సులువుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్‌లో నెగిటివిటీ తక్కువగా ఉన్నది ఈమెపై మాత్రమే. ఖచ్చితంగా శివ జ్యోతి కూడా టైటిల్ పోటీదారే అనడడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీముఖికి గట్టిగా పోటీగా ఈ సారి రేసులో చివరివరకు శివజ్యోతి కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకా బాబా భాస్కర్ కూడా ఫైనల్ వరకు నిలిచే అవకాశాలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి. వచ్చే 2 వారాల్లో ఖచ్చితంగా బాబా బయటికి వస్తాడని బిగ్ బాస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.


ఇంట్లో సభ్యుడైన రాహుల్ సిప్లిగంజ్ కూడా ఫైనల్ వరకు వస్తాడా రాడా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. పునర్నవి ఉన్నపుడు ఆమెతో ఫుల్ రొమాన్స్ పండించాడు గాయకుడూ రాహుల్ సిప్లిగంజ్. అయితే ఇండివిజువల్ గేమ్ ఆడటంలో మనోడు కాస్త వీక్ అనే చెప్పవచ్చు. అదే రాహుల్‌కు మైనస్ అని అనిపిస్తోంది. ఈ గేమ్ ప్లాన్‌తో టైటిల్ కొట్టడం కాస్త కష్టమే అని భావించవచ్చు.


ఈ సారి బిగ్ బాస్ 3 హౌజ్‌లో సూపర్ సర్ ప్రైజ్ ప్యాకేజ్ రాయలసీమ పోరడు మహేష్ విట్ట. ఈయనపై అసలు అంచనాలు కానీ ఆశలు కానీ లేవు. మనోడు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న ప్రతీసారి సేఫ్ అవుతూవచ్చాడు. కానీ ఈ వరం నామినేషన్ ఉండడం అతనికి తక్కవుగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈయన ఈ వరం బయటకి రావడం అని వార్తలు తెలుస్తోంది. ఇప్పుడున్న 8 మందిలో శ్రీముఖి, మహేష్ విట్ట, శివ జ్యోతి, వరుణ్ సందేశ్ మధ్య ఎక్కువగా పోటీ కనపడుతోంది. అయితే వీళ్లలో ఎవరు చివరివరకు నిలబడుతారో మరో రెండు వారాల్లోనే క్లారిటీ రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: