మాములుగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే సినిమా లో ముఖ్యంగా నటించే హీరో, హీరోయిన్లే కాకుండా చాలా మంది ఆర్టిస్టులు కలిసి నటిస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఎలాగంటే ఒక కూర రుచిగా ఉండాలంటే అన్నీ సమంగా సరిపోతేనే రుచి సూచి ఏదైన ఎక్కువైన కూడా కూర పాడవుతుంది. సినిమా కూడా అంతే అందరూ బాగుంటేనే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. 


ఇకపోతే పాటలు , ఫైట్లు , రొమాన్స్ డ్వైయన్స్ చేసేది హీరోహీరోయిన్లు కాగా మిగిలిన సినిమాని మొత్తం క్యారెక్టర్ అర్టిస్ట్స్ మాత్రమే చేస్తారు . తల్లిగా , చెల్లిగా ఓ ఫ్రెండ్ గా వీరు చేసే కామెడీ అంతా ఇంతకాదు.. ఆ సినిమా హిట్ అయిందంటే దానికి వారే కారణం అని చెప్పాలి. అలా సపోర్టింగ్ రోల్ లో చాలా మంది నటిస్తూ వస్తున్నారు. 


వివరాల్లోకి వెళితే.. చిన్న ఆర్టిస్ట్ నుండి పెద్ద ఆర్టిస్టు వరకు సినిమా ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగిస్తున్నారు. అయితే మన ఇండస్ట్రీలో ఉన్న సపోర్టింగ్ రోల్ చేసే ఆర్టిస్టులు వారు రోజుకు తీసుకొనే రెమ్యునరేషన్ విషయానికొస్తే భారీగానే తీసుకుంటున్నారు. ఎవరు ఎంత తీసుకుంటున్నారు అనే విషయం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..


రమ్యకృష్ణ ఆరు లక్షలు , జయసుధ రెండు లక్షలు , నదియా రెండు నుండి మూడు , రేవతి రెండు లక్షలు , హేమమాలిని కోటి , పవిత్ర 60000 , రోహిణి 60000, శరణ్య 50000 , హేమ 40000, తులసి 30000, ప్రగతి 30000 తీసుకుంటున్నారు..ఇది కేవలం రోజుకు మాత్రమే వారు తీసుకొనే రేట్లు..రోజుకు ఇంత అయితే, సినిమా అయ్యేలోగా ఎంతొస్తుందో .. 


మరింత సమాచారం తెలుసుకోండి: