‘ఈగ’ సినిమా విజయాన్ని హీరో నాని ఏమాత్రం ఉపయోగించు కోలేక పోయాడని టాలీవుడ్ విమర్శకులు అంటారు. దీనికి కారణం ‘ఈగ’ ఘనవిజయం తరువాత నాని ఎదుట క్యూ కట్టినా నాని ‘పైసా’ సినిమాను నమ్ముకుని తప్పటడుగు వేసాడు అని అంటారు. ఎంతో కాలంగా విడుదలకు నోచు కోకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ‘పైసా' చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు ఇచ్చారని అని అనుకొనే లోపే మళ్ళి వాయిదా పడే అవకాసం ఉందని ట్రేడ్ లో వార్తలు వినపడుతున్నాయి.  కేథరిన్, సిద్ధిక శర్మ హీరోయిన్లుగా చేస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ఫైనల్ చేసినట్లు చెప్పారు. అయితే ఇంకా ఫైనాన్స్ లు క్లియర్ కాలేదని,అనుకున్న తేదీకి విడుదల కావటం కష్టమేనని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు .తెలుస్తున్న సమాచరం ప్రకారం ఈ సినిమా దాదాపు 18 కోట్ల భారీ బడ్జెట్ తో తయారైందని, నాని మార్కెట్ ని అస్సలు దృష్టిలో పెట్టుకోకుండా భారీగా తీసారని దీనితో ఆర్దిక ఇబ్బందులు ఓ రేంజిలో ప్రారంభమయ్యాయని అంటున్నారు. నిర్మాత ప్రస్తుతం 12 కోట్ల వరకు ఫైనాన్స్ లు క్లియర్ చేయాలని,అప్పటివరకూ రిలీజ్ ఉండదని అంటున్నారు.  ఈ సినిమా కో కృష్ణవంశీ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాడం శాపంగా మారింది అని అంటున్నారు. అయితే ఆ ఖర్చు నాని మార్కెట్ ని దాటిపోవడం కృష్ణవంశీకి ప్రస్తుతం క్రేజ్ లేకపోవడంతో ఈ సినిమాను కొనుక్కునేవాళ్లు వెనక అడుగు వేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ఊబిలోకి నెట్టబడి అక్కడ నుండి డబ్బు చుట్టూ తిరిగే సమస్యలతో నిర్మించ బడ్డ ఈసినిమా బాగా వచ్చిందని ఎవరైనా పెద్ద నిర్మాత ధైర్యం చేసి ఈసినిమాను తీసుకుంటే గ్యారంటీ హిట్ అనే టాక్ వినపడుతోంది, ఇంతకీ ఈ ‘పైసా’ కష్టాలు తీరేది ఎప్పుడో.   

మరింత సమాచారం తెలుసుకోండి: