సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కొంతమంది కొన్ని విషయాలను బయటకు చెప్పేందుకు  చాలా వరకు ఇష్టపడరు.  ఎందుకంటే కొన్ని విషయాలు పర్సనల్ గా ఉంటాయి.  అలాంటి విషయాలు నలుగురితో పంచుకోవాలి అంటే భయపడతారు.  పెద్దగా ఆసక్తి చూపించరు.  అయితే, కొంతమంది మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా తమ విషయాలన్నీకూడా విడమరిచి చెప్పేస్తుంటారు. 


అదేమంటే తమ లైఫ్ తెరిచి ఉంచిన పుస్తకం.  అందులో దాచుకోవడానికి ఏమి ఉండదు అని చెప్పేస్తుంటారు. అలా చెప్పే హీరోయిన్లలో ఒకరు శృతి హాసన్.  కమల్ హాసన్ మాదిరిగానే ఈ అమ్మడు కూడా అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పేస్తుంది.  ఏ మాత్రం దాచుకోవడానికి ఆసక్తి చూపదు.  అన్ని ఓపెన్ అనేస్తుంది.  


కొన్నాళ్ల క్రితం వరకు లండన్ యువకుడితో ప్రేమలో పడింది.  రొమాంటిక్ గా సాగింది వారి జీవితం. సినిమాలు పక్కన పెట్టి వచ్చిన ఆఫర్లను పట్టించుకోకుండా లండన్ వెళ్ళిపోయి అక్కడ మ్యూజిక్ చేసుకుంటూ ఉండిపోయింది.  మరేమయిందో తెలియదు.. తిరిగి ఇండియాకు వచ్చేసింది.  సినిమాల్లో నటించేందుకు మరలా సిద్ధం అయ్యింది.  అయితే, ఈమెకు ఓ అలవాటు ఉన్నది.  


ఆ అలవాటు గురించి ఇటీవలే బయటపెట్టింది.  శృతిహాసన్ కు విస్కీ అంటే చాలా ఇష్టం.. తెగ తాగేసేది.  అయితే, కొంతకాలంగా విస్కీకి దూరంగా ఉంటున్నది.  కారణం.. ఆరోగ్యం.  విస్కీ తాగడం వలన తన ఆరోగ్యం దెబ్బతిన్నదని, అందుకే దానిని మానేసినట్టు చెప్పింది.  ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పింది శ్రుతిహాసన్.  

మంచు లక్ష్మి సెలెబ్రిటీ టాక్ షో నిర్వహిస్తోంది.  దానిపేరు ఫీట్ అప్ విత్ స్టార్స్. ఇందులో వారి అడిక్ట్స్ గురించి, వారి బెడ్ రూమ్ సంగతుల గురించి అన్నింటిని ఆమె ఈ షో ద్వారా ఆరా తీస్తుంది. ఈ షో ముఖ్య ఉద్దేశ్యం వారి పర్సనల్ లైఫ్ ఎంత రొమాంటిక్ గా ఉంటుంది.. ఎంత సీరియస్ గా ఉంటుంది అనే విషయాలను బయటకు తీయడమే.  ఈ షోలో శృతి హాసన్ తన విషయాలను బయటపెట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: