అందాలను బంధిస్తే అసలు వూరుకోవు. పొగరుగా ఎదిరిస్తాయి. ఎంతగా అణచివేస్తే అంతలా  దూసుకురావాలని చూస్తాయి. సూదంటిరాయిగా మారి చిట్టి గుండెకు చిల్లు పెడతామని అంటాయి. వాటిని నియత్రించడం  ఎంత కష్టమో మరి. తిరుగుబాటు చేసి నగుబాటునే మిగులుస్తాయి. సొగసుగత్తెకు సెగలు పుట్టించి మరీ జలపాతంలా దూకేస్తాయి.


ఇక చెప్పుకుంటే పాయల్ రాజ్ పుత్ అందాలు నిజంగా గోదావరి పరవళ్ళే. ఆ పడుచు అందం పదాహారేళ్ల జలతారే. అందంతోనే గుండెల్లో బాంబులు  పెడుతున్న పాయల్ ఆర్డీ ఎక్స్  100 తో దుమ్ము దులిపేసింది. హద్దులు లేవు. పద్దులూ లేవు ఇక రెచ్చిపోవడమేనంటూ పాయల్ చూపించిన అందాల ప్రదర్శనకు టాలీవుడ్ మొత్తం వూగెసింది. కొత్తందం అంటూ వెర్రెత్తిపోయింది.ఇపుడు అదే పాయల్ తో ఆర్డీ ఎక్స్ లవ్ అంటూ మరో సినిమా తీసి జనం మీదకు వదిలేశారు. ఈ సినిమాలో కూడా రెట్టించిన అందంతో పాయల్ ఆడియన్స్ మీదకు దండయాత్రే చేసింది. కొంటె కవి భావనలో చెప్పాలంటే పాయల్ అందాలన్నీ గోదావరి గట్టు తెంచుకున్నాయంట. వయ్యారాలను ఒలకబోస్తూ పరువాలు పరవళ్ళు తొక్కాయట.


సరే అందం బాగుంది. పాయల్ మరింతగా స్కిన్ షో చేసింది. కానీ కధ ఎక్కడుంది. కధనం ఎలా ఉంది. ఇదే కదా సినిమాను నిలబెట్టేది. ఆర్డీ ఎక్స్ హిట్ తే ఆదే సీక్వెల్ గా టైటిల్ పెట్టుకుని వస్తామంటే వర్కౌట్ అవుతుందా. పాయల్ వరకూ ఆమెకు ఇచ్చిన పాత్ర ఒకే. ఆమె యాక్షన్, అందాల కనువిందు ఒకే.  కానీ సినిమా కధ గతి తప్పిందని, అటు శ్రుంగార చిత్రమా ఇటు ఆదర్శ చిత్రమా తెలియకుండా మేకర్స్ గందరగోళంలో పడేశారని అంటున్నార్. దాంతో ఈ మూవీలో ఎంతలా అందాలను హద్దులు దాటించినా కూడా పాయల్ కి మిగిలింది పరితాపమేనని అంటున్నారు. ఆర్డీ ఎక్స్ 100 తో మొత్తం టాలీవుడ్ ని తనవైపు తిప్పుకున్న పాయల్ ఆర్డీ ఎక్స్ లవ్ తో పదడుగులు వెనక్కిపోయిందని అంటున్నారు. మరి ఈ అందాల బొమ్మను ముస్తాబు చేసి లైం లైట్ లోకి తెచ్చే  డైరెక్టర్ ఎవరో.



మరింత సమాచారం తెలుసుకోండి: